Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Temple Tragedy: ఇండోర్‌ ట్రాజెడీలో పెరుగుతోన్న మృతుల సంఖ్య.. 34 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం

పురాతన మెట్ల బావిపై 10 ఏళ్లక్రితం స్లాబ్‌వేసి ఓ గదిని నిర్మించారు. హోమం జరుగుతుండగా ఎక్కుమంది ఆ స్లాబ్‌పై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బరువును ఆపలేక కుంగిపోయింది. మెట్టబావిలోని నీటిని మోటారు నుంచి తొలగించారు.

Temple Tragedy: ఇండోర్‌ ట్రాజెడీలో పెరుగుతోన్న మృతుల సంఖ్య.. 34 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
Indore Temple Tragedy
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2023 | 7:20 AM

ఇండోర్‌ ఇన్సిడెంట్‌పై ఎంక్వైరీకి ఆదేశించింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. అసలెలా ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యం ఎవరిదో తేల్చాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు . ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతైనట్లు కలెక్టర్ డాక్టర్ ఇళయరాజా టి తెలిపారు. బావిలో పడిన భక్తులను వెలికితీసేందుకు ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. దాంతో, డెత్‌ టోల్‌పై ఇంకా సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది.

పండగపూట ఊహించని విషాదం.. శ్రీరామనవమి వేడుకల్లో ఘోరం ప్రమాదం .. ఇండోర్‌లో కుప్పకూలిన మెట్ల బావి.. అవును, ఇది పెనువిషాదం, అంతులేని దుఖం ఇది. పండగ సంబరం అనేక కుటుంబాల్లో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను తీసేసింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 34మంది  ప్రాణాలు కోల్పోయారు.  పలువురు  ఆచూకీ గల్లంతైంది.

సీతారాముల హోమం చేస్తుండగా మెట్ల భావి కుప్పకూలింది. ఊహించనివిధంగా జరిగిన ఈ ప్రమాదంలో 50 అడుగుల లోతున్న బావిలో పడిపోయారు భక్తులు. దీంతో రామనవమి వేడుకల్లో బాధాకరమైన అరుపులతో నిండిపోయాయి. కొందరు తాడుతో, మరికొందరు పొడవాటి వెదురు నిచ్చెనతో రక్షించేందుకు పరుగులు తీశారు. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను ఒక్కొక్కరుగా బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

34మంది మృతి, పలువురికి గాయాలు:

బావిలో చిక్కుకున్నవారిలో కొందర్నీ సేఫ్‌గా కాపాడారు రెస్క్యూ సిబ్బంది. మృతుల్లో 11మంది మహిళలు ఉండటం అక్కడున్న అందర్నీ కలిచివేసింది. బేలేశ్వర్‌ మహదేవ్‌ ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది. పురాతన మెట్ల బావిపై 10 ఏళ్లక్రితం స్లాబ్‌వేసి ఓ గదిని నిర్మించారు. హోమం జరుగుతుండగా ఎక్కుమంది ఆ స్లాబ్‌పై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బరువును ఆపలేక కుంగిపోయింది. మెట్టబావిలోని నీటిని మోటారు నుంచి తొలగించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతైనట్లు కలెక్టర్ డాక్టర్ ఇళయరాజా టి తెలిపారు.

ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. గాయపడినవారికి 50వేలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌. ఇక, ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. శ్రీరామనవమిరోజు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో తనను కలిచివేసిందన్నారు పీఎం మోడీ..

బావిపై అక్రమ నిర్మాణం, జనవరిలో నోటీసు జారీ ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. మరోవైపు, ప్రమాదం గురించి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఆఫీసర్ పిఆర్ ఆర్ రోలియా మాట్లాడుతూ, ఆలయం లోపల మెట్ల బావిపై నిర్మించిన అక్రమ నిర్మాణంపై 2022 ఏప్రిల్‌లో కొంతమంది స్థానికుల నుండి ఫిర్యాదు అందిందని..  జనవరిలో నోటీసు జారీ చేశామని చెప్పారు. 2023లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..