Curd Sachets: పెరుగు ప్యాకెట్‌పై హిందీ పదం.. తమిళనాట రచ్చరచ్చ.. హిందీని శాశ్వతంగా బహిష్కరిస్తామని సీఎం హెచ్చరిక

తాజాగా మరోసారి హిందీ భాష గొడవ మొదలైంది. హిందీని వ్యతిరేకిస్తూ మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి స్టాలినే చెబుతున్నారు. నందిని పెరుగు ప్యాకెట్‌.. దీనిపై తమిళం లేదు. హిందీ భాషలో దహీ అని ఉంది..హిందీలో దహీ అంటే పెరుగు అని అర్థం..ఇదే తమిళనాట రచ్చరచ్చ అవుతోంది.

Curd Sachets: పెరుగు ప్యాకెట్‌పై హిందీ పదం.. తమిళనాట రచ్చరచ్చ.. హిందీని శాశ్వతంగా బహిష్కరిస్తామని సీఎం హెచ్చరిక
Chief Minister Mk Stalin
Follow us
Surya Kala

|

Updated on: Mar 30, 2023 | 11:08 AM

తమిళనాడులో మళ్లీ భాషా ఉద్యమం జరగనుందా..కేంద్ర వైఖరిపై సీఎం స్టాలిన్‌ సీరియస్‌గా ఉన్నారా.. హిందీని వ్యతిరేకిస్తూ..మరో ఉద్యమం చేయాల్సిందేనని ముఖ్యమంత్రే చెప్పడం వెనుక ఆంతర్యమేంటి.. తమిళనాట మొదలైన దహీ వివాదం చివరకు ఉద్యమ రూపం దాల్చనుందా.. ఉన్నట్లుండి హిందీ భాష గొడవేంటి.. అసలేం జరిగింది.  తెలుసుకుందాం..

తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర లేదు. మాతృభాషను తప్ప మరో భాషను ఒప్పుకోరు..హిందీ పదం కనిపిస్తే చాలు ఆవేశంతో ఊగిపోతారు. ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం హిందీని తమపై రుద్దవద్దని పలుసార్లు చెప్పింది. అయినా కేంద్రం వదలడం లేదు. తాజాగా మరోసారి హిందీ భాష గొడవ మొదలైంది. హిందీని వ్యతిరేకిస్తూ మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి స్టాలినే చెబుతున్నారు. నందిని పెరుగు ప్యాకెట్‌.. దీనిపై తమిళం లేదు. హిందీ భాషలో దహీ అని ఉంది..హిందీలో దహీ అంటే పెరుగు అని అర్థం..ఇదే తమిళనాట రచ్చరచ్చ అవుతోంది. పెరుగు ప్యాకెట్లపై దహీ ఉండొద్దని.. దీన్ని ఎంతమాత్రం సహించమంటున్నారు సీఎం స్టాలిన్‌.

ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా..దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దుతోందని, పెరుగుకు సమానమైన తమిళ పదాన్ని ఉపయోగించాలని కోరారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని స్టాలిన్ ట్వీట్‌ చేశారు. తమిళం, కన్నడం మాట్లాడే రాష్ట్రాల్లో కూడా పెరుగు ప్యాకెట్లపై దహీ అనే హిందీ పదాన్ని వాడుతున్నారని… ఇలాంటి చర్యలు దక్షిణాది నుంచి హిందీని శాశ్వతంగా బహిష్కరించేలా చేస్తాయని స్టాలిన్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

FSSAI సూచనలను రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయబోమని, పెరుగు ప్యాకెట్లపై పెరుగు అనే పదానికి తమిళ సమానమైన తైర్ అని ముద్రించాలని ఆ రాష్ట్ర డెయిరీ అభివృద్ధి మంత్రి ఎస్ఎం నాసర్ చెప్పారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఇటీవల పెరుగు సాచెట్లపై స్థానిక పేర్లను ఉపయోగించాలని కోరాయి. కానీ..తమిళం & కన్నడ భాషల్లో కాకుండా, హిందీలో లేబుల్ వేయాలని..నందిని డైరీ సంస్థకు FSSAI నోటీసులిచ్చింది. దీంతో స్టాలిన్‌ భగ్గుమన్నారు.

పెరుగు ప్యాకెట్లపై హిందీని ముద్రించాలని నందిని పాల ఉత్పత్తి సంస్థకు కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో.. సీఎం స్టాలిన్‌ ఘాటుగా స్పందించారు. త్వరలోనే భాషా ఉద్యమాలతో అందరికీ బుద్ధి చెబుతామని సీరియస్‌ అయ్యారు. గురువారం తమిళనాడు పాల ఉత్పత్తి దారుల సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర వైఖరిపై..హిందీ రుద్దుడుపై ఏం చేయాలో నిర్ణయించనున్నారు.

తమిళనాడు బిజెపి అధ్యక్షుడు:

ఇదే విషయంపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధించారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలపై కేంద్ర సంస్థల జోక్యం తగదన్నారు. పెరుగు ఉత్పత్తులపై హిందీ వేయాలన్న నిబంధన తగదని చెప్పారు. ఈ విషయంపై తాము కేంద్రంతో మాట్లాడుతామని తెలిపారు. ఇదే విషయాన్నీ తమకు ప్రధాని మోడీ  దృష్టికి తీసుకెళతామని చెప్పారు అన్నామలై..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..