Marriage Rituals: తమ మేనల్లుడి పెళ్ళిలో 2.21 కోట్ల నగదు, కిలో బంగారం, 14కేజీల వెండి సహా రూ.8 కోట్ల గిఫ్ట్‌గా ఇచ్చిన మేనమామలు.. ఎక్కడంటే..

మెహ్రియా కుటుంబానికి చెందిన 6 మంది సోదరులు తమ సోదరి

Marriage Rituals: తమ మేనల్లుడి పెళ్ళిలో 2.21 కోట్ల నగదు, కిలో బంగారం, 14కేజీల వెండి సహా రూ.8 కోట్ల గిఫ్ట్‌గా ఇచ్చిన మేనమామలు.. ఎక్కడంటే..
Biggest Myra
Follow us

|

Updated on: Mar 27, 2023 | 11:53 AM

పెళ్లిలో మైరా సంప్రదాయాన్ని పాటిస్తూ రికార్డ్ సృష్టించిన మేనమామల గురించి ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా మరోసారి పతాక శీర్షికల్లో నిలిచింది. జిల్లాలో ఆదివారం జరిగిన ఓ పెళ్లిలో 6 మంది అన్నదమ్ములు తమ మేనల్లుడికి రూ.8 కోట్ల వహుమతిని పెళ్లి జరిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి కొడుకైన మేనల్లుడు కోసం.. మేన మామలు అందరూ మైరా నింపడానికి ఒక ప్లేట్‌లో నగదు, నగలతో వచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఇదే అతిపెద్ద మైరా అని చెబుతున్నారు. వాస్తవానికి.. నాగౌర్‌లోని ధింగ్‌సార గ్రామంలో.. మెహ్రియా కుటుంబం సాంప్రదాయం ప్రకారం మైరాను తీసుకుని కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు ..  ఎద్దుల బండ్లు సహా అనేక వాహనాలమీద  పెళ్ళికి బయలు దేరారు. ఇలా మైరాను ఊరేగింపుగా సుమారు రెండు కిలోమీటర్లు తీసుకుని వెళ్లారు.

నాగౌర్‌లోని డింగ్‌సార గ్రామానికి చెందిన మెహ్రియా కుటుంబంలోని అర్జున్ రామ్ మెహ్రియా, భగీరథ్ మెహ్రియా, ఉమ్మెదరమ్ మెహ్రియా, హరిరామ్ మెహ్రియా, మెహ్రమ్ మెహ్రియా, ప్రహ్లాద్ మెహ్రియా తన మేనల్లుడుకి ఇవ్వాల్సిన మైరాతో కలిసి తమ ఏకైక సోదరి భన్వారీ దేవి ఇంటికి చేరుకున్నారు. సుభాష్ గోదారలో ఈ వివాహం జరిగింది. ఈ మెహ్రియా కుటుంబం ,శ్రీమంతులుగా తెలుస్తోంది. వీరి ఫ్యామిలీకి ఆస్తులున్నాయి. ప్రభుత్వ ఒప్పందాలు,  వ్యవసాయంతో సంబంధం కలిగి ఉంది.

ప్లేటులో 2.21 కోట్ల నగదు అదే సమయంలో మైరాలో భాగంగా ఒక ప్లేట్‌లో రెండు కోట్ల 21 లక్షల రూపాయల నగదును ఉంచగా, దీనితో పాటు కిలోకు పైగా బంగారం, 14 కిలోల వెండిని కానుకగా ఇచ్చారు. అదే సమయంలో గోధుమలతో నింపిన  ట్రాక్టర్-ట్రాలీని కూడా ఇచ్చారు. మైరాలో భాగంగా మొత్తం రూ. 8 కోట్ల 1 లక్ష గిఫ్ట్ గా ఇవ్వగా అందులో 2.21 కోట్ల నగదు ఉంది.

ఇవి కూడా చదవండి

మెహ్రియా కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉదయం 10 గంటలకు తమ సోదరి ఇంటి వద్ద మైరాను నింపడానికి ట్రాక్టర్‌పై టెంట్ వేసుకుని మరీ  పాటలు పడుతూ.. డ్యాన్స్ చేస్తూ ఊరేగింపుగా బయలు దేరారు.  రహదారిపై 2 కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు ఈ మేరలో సందడి చేశాయి. అదే సమయంలో.. అక్కడ ఉన్న ప్రతి అతిథికి ఒక వెండి నాణెం కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.

అక్క పేరు మీద 100 బిగాల భూమి మెహ్రియా కుటుంబానికి చెందిన 6 మంది సోదరులు తమ సోదరి కోసం 4 కోట్ల 42 లక్షల రూపాయల విలువైన 100 బిగాల భూమిని కూడా ఇచ్చారు. ధింగ్సారా గ్రామంలో  మైరా నింపిన తర్వాత,..  తమ సోదరి అవసరాలన్నీ తీర్చిన సోదరుల గురించి ప్రతిచోటా చర్చించుకుంటున్నారు.

విశేషమేమిటంటే, మార్వార్‌లోని నాగౌర్‌లో పెళ్లికి ముందు మైరా నింపే సంప్రదాయం అతి పురాతనమైంది.  మైరా గురించి అనేక పౌరాణిక ఇతిహాస కథలున్నాయి. వీటి ప్రకారం మొఘల్ కాలంలో, ఖిన్యాల జాట్‌లు,  జయల్ లిచ్మా గుజ్రీని తమ సోదరిగా భావించి.. మైరా ను ఇచ్చే సాంప్రదాయం మొదలైంది. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..