AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Success Story: రూ.10 వేలు పెట్టుబడితో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించి.. ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తున్న రైతు..

రాజస్థాన్ కు చెందిన నరేంద్ర మాలవ్ అనే రైతు.  అన్నదాత పంటలను పండించడమే కాదు.. తేనెటీగల పెంపకంలో కూడా నిపుణుడు. అతని శ్రమకు తగిన  గౌరవం, ప్రశంసలతో పాటు.. ప్రతి సంవత్సరం మిలియన్ల డాలర్లను సంపాదిస్తున్నాడు

Business Success Story: రూ.10 వేలు పెట్టుబడితో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించి.. ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తున్న రైతు..
Sucess Story
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2023 | 10:38 AM

తేనె ఔషదాల గని. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం నుండి గుండె ఆరోగ్యాన్ని కాపాడే వరకు తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తేనే కోసం తేనెటీగల పెంపకాన్ని చేపట్టిన ఓ రైతు ఏడాదికి లక్షల్లో సంపాదిస్తున్నాడు. కొంచెం సృజనాత్మకత.. కొంచెం కొత్తదనం కలిసి ఆలోచిస్తే ఏ వ్యాపారమైనా లాభాల బాటను పట్టించవచ్చు అని నిరూపించాడు. రాజస్థాన్ కు చెందిన నరేంద్ర మాలవ్ అనే రైతు.  అన్నదాత పంటలను పండించడమే కాదు.. తేనెటీగల పెంపకంలో కూడా నిపుణుడు. అతని శ్రమకు తగిన  గౌరవం, ప్రశంసలతో పాటు.. ప్రతి సంవత్సరం మిలియన్ల డాలర్లను సంపాదిస్తున్నాడు. 2004లో తేనెటీగల పెంపకం ప్రారంభించిన కోటకు చెందిన చిన్న రైతు నరేంద్ర మాలవ్ విజయగాథ గురించి ఈరోజు తెలుసుకుందాం..

కోటాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో మాలావ్ తేనెటీగల పెంపకం కోచింగ్ పొందాడు. మాలావ్ ఇప్పుడు తేనెతో పాటు తేనెటీగలను కూడా విక్రయిస్తాడు. తేనెను అమ్మడం కంటే తేనెటీగలు అమ్మడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించేందుకు, మాలావ్ కేవలం రూ.10,000 పెట్టుబడి పెట్టాడు.

నరేంద్ర మాలావ్ .. అతని సోదరుడు మహేంద్ర మాలావ్ ఇద్దరూ తేనెటీగల పెంపకందారులు. తేనెటీగల పెంపకంతో సంవత్సరానికి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. కోటాలో కొత్తిమీర, ఆవాలు పంటలు పండుతాయి. ఈ పంటలను పండిస్తూనే మరోవైపు తేనెటీగల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. సీజన్ 8 నెలల పాటు తేనెటీగల పెంపకం కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

వార్షిక ఆదాయం రూ.25 లక్షలు

ఇప్పుడు తేనెటీగల పెంపకంతో వార్షిక ఆదాయం రూ.25 లక్షల వరకు పెరిగిందని రైతు నరేంద్ర మాలవ్ పేర్కొన్నారు. తనకు సాయంగా ఎనిమిది మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. పొలాల్లో తేనెటీగల పెట్టెలు పెట్టి బీ కాలనీలు సృష్టిస్తున్నామని మాలావ్ వివరించారు. ప్రస్తుతం మాలావ్‌లో 1300 బీ కాలనీలు ఉన్నాయి. ఒక కాలనీ ప్రతి సంవత్సరం 25 నుండి 30 కిలోల తేనెను ఉత్పత్తి అవుతుంది. ఒకొక్క బీ కాలనీ సంవత్సరానికి 7 నుండి 8 సార్లు తేనెను అందిస్తుంది.

అయితే నరేంద్ర సోంపు, ఆవాలు, కొత్తిమీర, ధనియాల తేనెతో సహా అనేక రకాల తేనెను  తయారు చేస్తారు.

తేనెటీగల పెంపకానికి నిర్వహణ అవసరం

తేనెటీగల పెంపకాన్ని చాలా జాగ్రత్తగా చేయాలనీ.. మంచి నిర్వహణ సామర్ధ్యం కలిసి ఉండాలని మాలవ్ వివరించారు. పటిష్టమైన నిర్వహణతో మాత్రమే ఎవరైనా సరే బలమైన ఆర్థిక ఫలితాలను సాధించగలరని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకం పరిశ్రమపై మార్గదర్శకత్వం చేస్తూ.. ఏ రైతు అయినా తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే.. పెట్టుబడిగా మొదట 25 నుండి 30 వేల రూపాయల పెట్టాలని తెలిపారు. 25 నుండి 50 పెట్టెలను మొదట ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..