Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ముంబై వందే భారత్ రైలును నడిపిన సురేఖ.. ఆసియాలో ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్‌గా చరిత్ర..

2023 మార్చి 13న షోలాపూర్-CSMT వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మహిళా లోకో పైలట్ నడిపారు. దీంతో  దేశంలో మాత్రమే కాదు  ఆసియాలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిన మొదటి మహిళా  పైలట్‌గా అవతరించారు అని CR అధికారి ఒకరు తెలిపారు.

Success Story: ముంబై వందే భారత్ రైలును నడిపిన సురేఖ.. ఆసియాలో ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్‌గా చరిత్ర..
Surekha Yadav, Asia's first female loco pilot
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2023 | 10:36 AM

అవకాశం ఇచ్చి చూడు మగువ తనని తాను ఆవిష్కరించుకుంటుంది.. చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంటుంది. తాజాగా ఆసియాలోనే తొలి మహిళా లోకో డ్రైవర్‌ సురేఖ యాదవ్‌ రికార్డ్ సృష్టించారు.  సోమవారం నుంచి షోలాపూర్‌ వరకూ CSMTకి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపారు. ఈ ఘనత సాధించిన సురేఖ యాదవ్ ను ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో తోటి రైలు డ్రైవర్లు సత్కరించారు.

” 2023 మార్చి 13న షోలాపూర్-CSMT వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మహిళా లోకో పైలట్ నడిపారు. దీంతో  దేశంలో మాత్రమే కాదు  ఆసియాలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిన మొదటి మహిళా  పైలట్‌గా అవతరించారు అని CR అధికారి ఒకరు తెలిపారు. భారతీయ రైల్వేలకు ఇది గర్వకారణమైన సంఘటన అని అన్నారు.

“నూతన యుగంలో..  అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన వందే భారత్ రైలును నడిపే అవకాశాన్ని తనకు కల్పించినందుకు రైల్వే శాఖ అధికారులకు సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. నిర్ణయించిన సమయంలో షోలాపూర్ నుండి బయలుదేరిన ట్రైన్ నిర్ణీయ సమయానికి 5 నిమిషాల ముందు CSMTకి చేరుకుంది. సిబ్బంది అభ్యాస ప్రక్రియలో భాగంగా సిగ్నల్ పాటించడం, కొత్త పరికరాలపై పట్టు, ఇతర సిబ్బందితో సమన్వయం, రైలు నడపడానికి అన్ని పారామితులను పాటించాలని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

సురేఖ యాదవ్ ఎవరంటే?

మహారాష్ట్రలోని సతారాకు చెందిన  సురేఖ యాదవ్.. 1988లో భారతదేశపు మొదటి మహిళా రైలు డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. ఆమె సాధించిన విజయాలకు గాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను అందుకుంటారు. అనేక సన్మానాలతో సత్కరించారు.

 1988లో లోకో పైలట్ గా మారిన సురేఖ యాదవ్

సురేఖ యాదవ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా విద్యనభ్యసించారు. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగంలో చేరారు.  సురేఖను అత్యాధునిక వందే భారత్ రైలు డ్రైవింగ్ చేసిన   మొదటి అనుభవం గురించి అడిగినప్పుడు, “వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలు, అధునాతన సాంకేతికతతో కూడిన రైలు, కాబట్టి సాంప్రదాయ రైళ్లతో పోలిస్తే మరింత అప్రమత్తత అవసరం” అని అన్నారు. వందే భారత్ రైలులో డ్రైవర్‌గా చేరడానికి ముందు..  ఆమె ఫిబ్రవరి 2023లో వడోదర రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణను తీసుకున్నారు.

సురేఖ అత్యంత నైపుణ్యం గల రైలు డ్రైవర్‌లలో ఒకరిగా ఖ్యాతిగాంచారు. అయితే సురేఖ కారు డ్రైవింగ్‌లో లేదా ద్విచక్ర వాహనం నడపడానికి ఎప్పుడూ  ప్రయత్నించలేదు. అయితే ఇదే విషయంపై సురేఖ యాదవ్ ను ఎవరైనా అడిగితే తాను.. “పురుషులు చేయగలిగినవన్నీ చేయగలనని  ఖచ్చితంగా అనుకుంటున్నాను.. అయితే ఇంతవరకు కారు లేదా బైక్ నడపడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే నేను వాటిని డ్రైవ్ చేయాల్సిన అవసరం అనిపించలేదన్నారు సురేఖ.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..