AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Day: రైతుకు ఐదుగురు కూతుర్లే.. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లే.. నేటి యువతకు స్ఫూర్తి ఈ అక్కచెల్లెలు

తన పేదరికం కూతుర్ల చదువుకు ఆటంకం కలిగించ కూడదని భావించాడు. ఆడపిల్లలను బడికి పంపే స్థోమత లేకపోయినా ఇంట్లోనే చదువు చెప్పి పెద్ద కలలు కనేలా ప్రోత్సహించాడు. అంతేకాదు తనకు కలెక్టర్‌ కావాలన్న కోరిక ఉండేదని.. అది నెరవేరలేదని తన  కుమార్తెలకు చెప్పాడు సహదేవ్. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట కూతుర్ల ముందు బయటపెట్టాడు. 

Women's Day: రైతుకు ఐదుగురు కూతుర్లే.. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లే.. నేటి యువతకు స్ఫూర్తి ఈ అక్కచెల్లెలు
Farmer's Daughters
Surya Kala
|

Updated on: Mar 07, 2023 | 7:09 PM

Share

మనిషి అంబరాన్ని తాకుతున్నా.. సముద్రం లోతులను కొలుతున్నా.. సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా అడుగులు వేస్తున్నా.. నేటికీ అనేక మూఢనమ్మకాలను విశ్వసించేవారు సమాజంలో కనిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్ల మైనస్.. మగపిల్లాడు ప్లస్ అనే ఆలోచన మనదేశంలో ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఆడపిల్ల మగపిల్ల అనే విషయంలో తేడా లేదు.. అంటూ ఎంతగా చెబుతున్నా చాలామంది తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు రావడం లేదు. ఆడ భ్రూణహత్యలు, బాల్య వివాహాలకు అపఖ్యాతి పాలైన రాష్ట్రంలో.. ఒక రైతు ఐదుగురు కుమార్తెలు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు.. తాము అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత కావడానికి కారణం తమ తండ్రి అంటూ గర్వంగా చెబుతారు. రాజస్థాన్ కు చెందిన ఈ ఐదుగురు అక్కచెల్లెలు నేటి యువతకు స్ఫూర్తి.. ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే ఆ వీధిలోని వారంతా చేసే సంబరాల గురించి హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే.. మరి అలాంటిది ఒకే ఇంట్లో ఐదుగురు కలెక్టర్లు అయితే.. మరి ఆ కుటుంబం.. ఆ వీధిలో ఉండేవారు పొందే ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అలాంటి అరుదైన కుటుంబం సహదేవ్‌ సహరన్‌.

రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లాలోని భేరుసరి అనే చిన్న గ్రామానికి చెందిన సహదేవ్ సహారన్ , లక్ష్మి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. కొడుకు కోసం చూస్తే ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. రోమా,   మంజు,   అన్షు,   రీతు,   సుమన్‌ పేర్లు పెట్టుకున్నారు. తల్లి లక్ష్మి చదువుకోలేదు. తండ్రి సహదేవ్  రైతు..వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు.. అయితే గ్రామంలో నిరంతరం నీటి ఎద్దడి.. దీంతో ఎంత కష్టపడినా పొలంలో మంచి దిగుబడి వచ్చేది కాదు.

తన పేదరికం కూతుర్ల చదువుకు ఆటంకం కలిగించ కూడదని భావించాడు. ఆడపిల్లలను బడికి పంపే స్థోమత లేకపోయినా ఇంట్లోనే చదువు చెప్పి పెద్ద కలలు కనేలా ప్రోత్సహించాడు. అంతేకాదు తనకు కలెక్టర్‌ కావాలన్న కోరిక ఉండేదని.. అది నెరవేరలేదని తన  కుమార్తెలకు చెప్పాడు సహదేవ్. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట కూతుర్ల ముందు బయటపెట్టాడు.

ఇవి కూడా చదవండి

దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత రోమా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) పరీక్షకు సిద్ధం అయ్యారు. తండ్రి కలను తాము తీర్చడమే లక్ష్యంగా చదువుకున్నారు. 2010లో రోమా తన కుటుంబంలో మొదటి RAS అధికారి అయ్యారు. అనంతరం 2017లో మంజు కూడా పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరు అక్కలు సాధించిన విజయంతో స్ఫూర్తి పొందిన చెల్లెళ్లు అన్షు, రీతు,  సుమన్ కూడా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ప్రిపేర్ కావడం ప్రారంభించారు.

2018లో RAS పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అన్షు, రీతు, సుమన్‌ లు రాజస్తాన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ కు ఏకకాలంలో ఎంపికై అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రజల దృష్టిని తమవైపుకు తిప్పేలా చేశారు ఈ అక్కాచెల్లెళ్లు.  పట్టుదల, కృషితో, ఐదుగురు అమ్మాయిలు ఇప్పుడు RAS ఆఫీసర్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారు.

తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న తనయలు..  కలెక్టర్లుగా ఎంపికయ్యి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు. అంతేకాదు కుమార్తెలకు మంచి భవిష్యత్ ఇచ్చిన తండ్రి సహదేవ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..