Success Story: ఉద్యోగం వదిలి.. తండ్రి బాటలో వ్యవసాయం చేస్తున్న ఇంజనీర్.. గులాబీ పూల సాగుతో లక్షల్లో ఆదాయం

ముందు అందరి యువకుల్లా.. ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత.. వ్యవసాయాన్నే వృత్తిగా, ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు. ఇంజనీరింగ్‌ చదివినా తనకు ఇష్టమైన పూల సాగు వైపు మొగ్గుచూపాడు.

Success Story: ఉద్యోగం వదిలి.. తండ్రి బాటలో వ్యవసాయం చేస్తున్న ఇంజనీర్.. గులాబీ పూల సాగుతో లక్షల్లో ఆదాయం
Engineer Flower Cultivation
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2023 | 11:08 AM

ఇంజనీరింగ్‌ చదివాడు, కొన్నాళ్లూ ఉద్యోగం కూడా చేశాడు, కానీ అతనికి ఆ ఉద్యోగం హ్యాపీనెస్‌ ఇవ్వలేదు. సొంతూరుకి వచ్చేసి గులాబీల సాగు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రతి నెలా లక్షల్లో గడిస్తున్నాడు గోదావరి జిల్లా యువకుడు.. ఇంజనీర్ ఉద్యోగం వదిలి, ఈ రైతు సోదరుడు అందమైన గులాబీ  పువ్వును సాగు చేయడం ప్రారంభించాడు.

ఆ యువకుడు పేరు పృధ్వీ, చదివింది బీటెక్‌ మెకానికల్‌.. ఏలూరు జిల్లాలోని కళ్లచెరువు గ్రామం స్వస్థలం. ఇతను చదివిన చదువుకి ఏదైనా ఎంఎన్‌సీ కంపెనీలో చేరితే ఏసీ గదుల్లో పనిచేస్తూ కడుపులో చల్ల కదలకుండా జీవితాన్ని గడిపేయొచ్చు. ముందు అందరి యువకుల్లా.. ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత.. వ్యవసాయాన్నే వృత్తిగా, ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు. ఇంజనీరింగ్‌ చదివినా తనకు ఇష్టమైన పూల సాగు వైపు మొగ్గుచూపాడు. తన తండ్రి బాటలోనే వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు పృధ్వీ.

మల్టీనేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగం చేసినా తనకు సంతృప్తి కలగలేదని, అందుకే పూల సాగు వైపు వచ్చానంటున్నాడు పృధ్వీ. బెంగళూరులో పూల తోటలను పరిశీలించి… సొంతూరుకొచ్చి మెట్ట ప్రాంతంలో గులాబీ సాగును మొదలుపెట్టినట్టు చెబుతున్నాడు. మొత్తం 15 ఎకరాల్లో గులాబీ సాగు చేస్తున్న పృధ్వీకి మంచి ఆదాయమే వస్తోంది. రోజు విడిచి రోజు ఎకరానికి 40 కేజీల దిగుబడి వస్తుందని, కిలో గులాబీలకు మినిమం 80 రూపాయలు ధర వస్తున్నట్లు చెబుతున్నాడు పృధ్వీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్