Andhra Pradesh: ఆ వాలంటీర్లకు జగన్ సర్కార్ తీపి కబురు.. నెలకు రూ.2500 పెన్షన్
అమరావతి గ్రామాల వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి పింఛను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తెలిపారు.
సీఎం జగన్ కీలక నిర్ణయం తీసకున్నారు. అమరావతిలో భూమిలేని గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు పింఛను మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి గురువారం తెలిపారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ఈ పింఛను అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల అమరావతి గ్రామాల్లో పర్యటించారు శ్రీలక్ష్మి. ఆ సమయంలో.. భూమి లేని పేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు పెన్షన్ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
వారికి చేదోడుగా నిలస్తామని హామి ఇచ్చిన శ్రీలక్ష్మి.. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి.. నిరుపే గ్రామ వాలంటీర్ల ఫ్యామిలీలకు పెన్షన్ ఇవ్వాలని సూచించారు. సీఎం సూచన మేరకు సుమారు 200 మంది వాలంటీర్ల కుటుంబాలకు మార్చి నెల నుంచి పింఛను అందించనున్నట్లు శ్రీలక్ష్మి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి