AP Governor: ఏపీ గవర్నర్‌గా జస్టీస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం.. హాజరైన సీఎం జగన్‌, మంత్రులు, న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్​ నూతన గవర్నర్‌గా జస్టిస్​ అబ్దుల్​ నజీర్​ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్​భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు.

AP Governor: ఏపీ గవర్నర్‌గా జస్టీస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం.. హాజరైన సీఎం జగన్‌, మంత్రులు, న్యాయమూర్తులు
Justice Abdul Nazir Sworn
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 24, 2023 | 11:22 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఏపీకి మూడో గవర్నర్ గా సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన అబ్ధుల్ నజీర్.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అయిన మూడో న్యాయమూర్తిగా నజీర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయన ఫిబ్రవరి మాసాంతానికి ఒక రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తుండటం విశేషం.

నూతన గవర్నర్‌ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రస్థానం.. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ స్ధానంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం స్వీకారం చేశారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించిన అబ్దుల్‌ నజీర్‌.. మంగళూరులో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో అడ్వకేట్​ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అడిషనల్​ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే హైకోర్టులో పర్మినెంట్​ న్యాయమూర్తిగా అవకాశం చేజిక్కించుకున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూనే 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు పదోన్నతి లభించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే