AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP-Telangana: ఉన్నఫలంగా ఆగిపోతున్న చిట్టి గుండెలు.. 2 రోజుల్లో ముగ్గురు

30 ఏళ్లు కూడా రాకుండానే ప్రాణాలు తీస్తున్నాయి హార్ట్‌ ఎటాక్‌లు. హైదరాబాద్‌, కోనసీమల్లో హార్ట్‌ ఎటాక్‌తో ముగ్గురు మృతి చెందారు.

AP-Telangana: ఉన్నఫలంగా ఆగిపోతున్న చిట్టి గుండెలు.. 2 రోజుల్లో ముగ్గురు
Raja Babu - Constable Vishal
Ram Naramaneni
|

Updated on: Feb 24, 2023 | 12:09 PM

Share

ఆస్పత్రికి తరలించే సమయం కూడా లేకుండా సడన్‌ డెత్‌లు ఇప్పుడు షాక్‌కి గురి చేస్తున్నాయి. క్షణ క్షణానికీ కౌంట్‌డౌనే. ఔను.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కళ్లముందే ప్రాణాలు పోతున్నాయ్‌.. ఏమైందో తేరుకుని CPR చేసేలోపే జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయ్‌. ఈ మధ్య కాలంలో ఇలాంటి సడన్‌ హార్ట్‌ ఎటాక్‌లు పెరిగిపోయాయి. సికింద్రాబాద్‌లో జిమ్ చేస్తూ విశాల్ చనిపోతే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఓ 28 ఏళ్ల యువకుడు చనిపోయాడు. కె.గంగవరం మండలం యండగండికి చెందిన గ్రామ వాలంటీర్ రాజాబాబుకు 28 ఏళ్లు. ఈనెల 16నే పెళ్లైంది. ఇంతలోనే గుండెపోటుతో అతను చనిపోవడంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది. హార్ట్‌ ఎటాక్‌తో అతను చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌లో ఉన్నారు. ఇంత అర్థాంతరంగా మృత్యువు మింగేస్తుందని అనుకోలేదంటూ కన్నీరు పెడుతున్నారు.

సికింద్రాబాద్‌లో కానిస్టేబుల్‌ విశాల్‌, కోనసీమలో వాలంటీర్‌ రాజాబాబులు సడన్‌గా హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్టే.. నిన్నటికి నిన్న హైదరాబాద్‌ కాలాపత్తర్‌లో ఓ వ్యక్తి ఇలానే మరణించాడు. ఓ నిఖాకు హాజరైన రబ్బానీ అనే వ్యక్తి సడన్‌ డెత్‌ అందరినీ షాక్‌కు గురిచేసింది. వరుడితో మాట్లాడుతూ, సరదాగా ఉంటూనే క్షణాల్లోనే హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. మనిషి జీవితానికి గ్యారెంటీ లేదని నిరూపిస్తున్నాయి.. ఈ వీడియోలన్నీ చూస్తుంటే మామూలుగా ఫిట్‌గా ఉన్నాం అనుకునే వాళ్లకు కూడా గుండెల్లో దడ పుట్టేలా ఉంది. ఎందుకిలా జరుగుతోంది.. ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్‌లో తేడా వల్లా లేదంటే కరోనా తర్వాత వస్తున్న ఆరోగ్య సమస్యలు దీనికి కారణమా…!! ఎవరూ స్పష్టమైన కారణం చెప్పలేకపోతున్నారు..

పునీత్ రాజ్‌కుమార్‌ నుంచి నిన్నటికి నిన్న తారకరత్న మరణం వరకూ ఎందుకిలా సడన్‌గా కుప్పకూలిపోతున్నారో తలచుకుంటేనే భయపడేలా ఉంటున్నాయ్‌ సంఘటనలు. వయసు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారో, స్థూలకాయుల్లోనో గుండెపోటు వచ్చిందనే వార్తలు ఇప్పుడు యువకులకు కూడా పాకడం.. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు