Success Story: ఐటీ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి ఎండు చేపల బిజినెస్ లో అడుగు పెట్టిన స్నేహితులు.. నెలకు 15 లక్షల సంపాదన

ఓ ఇద్దరు యువకులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్నారు.. ఉద్యోగంలో చేరారు. తర్వాత బిజినెస్ రంగంలో అడుగు పెట్టి.. ఎండు చేపలను విక్రయించడం మొదలు పెట్టారు. సక్సెస్ బాట పట్టారు.. ఈ ఇద్దరు స్నేహితులు.  

Success Story: ఐటీ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి ఎండు చేపల బిజినెస్ లో అడుగు పెట్టిన స్నేహితులు.. నెలకు 15 లక్షల సంపాదన
Lemurian Bazaar
Follow us

|

Updated on: Feb 22, 2023 | 4:26 PM

ఆర్ కలైకతిరవన్, ఎ కృష్ణసామి ఇద్దరు స్కూల్ నుంచి స్నేహితులు.. 2009లో వేర్వేరు కాలేజీలనుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. అయితే చదువుకునే సమయంలో ఇద్దరూ చెన్నైలో రూమ్‌మేట్స్‌. చదువు కంప్లీట్ అయిన వెంటనే చెన్నైలోనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగరీత్యా.. ఒకరు కడలూరు.. మరొకరు  బెంగుళూరుకు వెళ్లారు. అయితే ఉద్యోగం చేస్తున్నా.. ఏదొక వ్యాపారం చేయాలనీ కోరుకునే స్నేహితులు ఇద్దరూ.. తమ కలలను ఒకరికొకరు చెప్పుకునేవారు. దీంతో ఆర్ కలైకతిరవన్ స్వస్థలమైన రామనాథపురం తిరిగి వచ్చి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే.. సాంకేతికత లేదా ఇంజినీరింగ్ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకునే ఇతర ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల మాదిరిగా కాకుండా..  ఈ ఇద్దరూ ‘డ్రై ఫిష్’ విక్రయించడాన్ని ఎంచుకున్నారు. ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఆర్ కలైకతిరవన్  కడలూర్‌లోని మురుగునీటి నిర్వహణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా.. ఎ కృష్ణసామి బెంగళూరులోని ఫైర్‌వాల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కూడా వీరిద్దరూ తమ బిజినెస్ గురించి ఫోన్‌లో చర్చించుకొనేవారు. దీంతో తమ వ్యాపారానికి ‘లెమురియన్ బజార్’ అని పేరు పెట్టారు.

2019లో కలైకతిరవన్ కడలూరులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రామనాథపురం తిరిగి వచ్చాడు. రెండేళ్ల తర్వాత కృష్ణసామి అతనితో చేరాడు. అయితే కృష్ణసామి ఐటీ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్న సమయంలో అతని కుటుంబ సభ్యులు భయపడ్డారు. పెళ్లి కాదని.. ఎవరూ పిల్లని ఇవ్వరని కూడా చెప్పారు. దీంతో కృష్ణ పెళ్లి అయ్యేవరకూ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వకుండా ఎదురుచూశాడు. పెళ్లి అయిన ఆరునెలల తర్వాత తన భార్యకు, తల్లిదండ్రులకు తన నిర్ణయం చెప్పి.. ఉద్యోగానికి రాజీనామా చేసి.. తన స్నేహితుడి చేస్తున్న వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు.

అయితే మొదటి నుంచి కృష్ణసామి తన స్నేహితుడు కలైకతిరవన్ కు వ్యాపారాన్ని స్థాపించడంలో సహాయపడ్డాడు. ఇందుకోసం వీకెండ్స్ లో బెంగళూరు.. రామనాథపురం మధ్య తిరుగుతూనే ఉన్నాడు. అంతేకాదు ఎండు చేపల వ్యాపారం గురించి అధ్యయనం చేశాడు. చేపల్లో సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవడం, నాణ్యమైన ఉత్పత్తిని ఎంచుకోవడం వంటివి నేర్చుకున్నాడు

ఇవి కూడా చదవండి

నాణ్యమైన ఎండు చేపలను ఎంచుకుని .. ప్యాక్ చేసే పెట్టెల నుండి వాసన లేకుండా చూడడం పెద్ద సవాల్ గా మారింది. ముందుగా ఎండు చేపలను కొనుగోలు చేయడానికి అనేక ప్రదేశాలను విజిట్ చేశారు. కొన్నిప్రదేశాల్లో నాణ్యత తక్కువగా ఉన్నాయని వాటిని పక్కకు పెట్టేశారు. చివరగా పాంబన్ లో ఒక మత్స్యకారుడు , వ్యాపారి మూకన్‌ని కలుసుకున్నారు. వారు స్నేహితులకు కావాల్సిన నాణ్యతతో ఎండు చేపలను సరఫరా చేయడానికి అంగీకరించారు. శ్రీలంకలో  దొరికే ఎందుకు చేపలకు ఏ మాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన చేపలను ఎంచుకున్నారు.  ఆన్‌లైన్‌లో ఎండు చేపలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామని ”అని కలైకతిరవన్ చెప్పారు.

ఎండు చేపలను గాలి చొరబడని కంటైనర్లలో ప్యాక్ చేయడానికి 10 మంది సభ్యుల మహిళా స్వయం సహాయక బృందాన్ని ఎంపిక చేసుకున్నారు.  QR కోడ్‌లు ఏర్పటు చేశారు. కస్టమర్స్ ఎంపిక చేసుకునే చేపలకు లెమురియన్ బజార్ కి చెందిన ల్యాబ్ సర్టిఫికేట్ ను అందిస్తున్నారు. తమ ఉత్పత్తులను అమెజాన్‌లో అమ్మకం ప్రారంభించారు. ఇప్పడు నెలకు 3 లక్షలకు పైగా అమ్మకాలు చేస్తున్నారు.  మంచి నగరంలో తమ బిజినెస్ ను ప్రారంభించాలని భావించిన ఇద్దరు స్నేహితులు.. మదురై జంక్షన్‌లో స్థలం కోసం రైల్వే అధికారులను సంప్రదించారు. వారికి ఏడాది పాటు స్థలం ఇచ్చింది. ఎండు చేపలను విక్రయించడంలో మొదటి సవాలు వాసన దీనిని వారు సక్సెస్ ఫుల్ గా అధిగమించారు. సముద్ర తీర నేపథ్యంతో అందంగా రూపొందించిన ‘డ్రై ఫిష్ హట్’ ఇప్పుడు మధురై జంక్షన్‌లోని పూల దుకాణం పక్కన ఉంది. దీనిని కలైకతిరవన్ చూసుకుంటాడు.

లెమురియన్ బజార్ డ్రై ఫిష్ హట్ 30 రకాల ఎండు చేపలను 100 నుండి 400 వరకు విక్రయిస్తుంది. నెతిలి (ఆంకోవీస్) నుండి షార్క్స్,  స్టింగ్రేల వరకు.. అనేక రకాలు కస్టమర్స్ కు అందుబాటులో ఉన్నాయి. ఎండు చేపలు ఉప్పు ఉన్నవి, ఉప్పు లేనివిగా అమ్ముతున్నారు.  ఇప్పటికే నెలకు 15 లక్షల టర్నోవర్ కు చేరుకున్నారు. మొదటి సంవత్సరంలో 2 కోట్ల టర్నోవర్ సాధించాలని స్నేహితులిద్దరు భావిస్తున్నారు. ఇద్దరు కొంత వ్యక్తిగత పెట్టుబడితో పాటు, ప్రమోటర్లు NABARD నుండి సుమారు 25 లక్షలను సేకరించారు. అమ్మకాలు స్థిరీకరించబడిన తర్వాత అదనపు అవుట్‌లెట్‌లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు