Viral Video: ప్రకృతి ఒడిలో కంటి వైద్యుడు.. వానరానికి వైద్యం చేస్తున్న వానరం.. చూస్తే వావ్ అనాల్సిందే..
ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అడివిలో ఓ రెండు కోతులు ఓ చోట రెండు కోతులు కూర్చుని ఉన్నాయి. వాటిలో ఒకటి మరో కోతి కంటిని తెగ పరీక్షిస్తోంది.
సోషల్ మీడియాలో వినోదానికి కొదవే ఉండదు. ఇందులో వైరల్ అయ్యే ఎన్నో వీడియోలు నెటిజన్లకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తాయి. ఇక వినోదం దగ్గరకి వస్తే.. జంతువుల్లో మహా కొంటె జంతువు కోతి. అందుకే మనుషుల్లో ఎవరైనా కాస్త ఎక్కువగా అల్లరి చేస్తే కోతి చేష్టలు చేయకు అంటూంటారు. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అడివిలో ఓ రెండు కోతులు ఓ చోట రెండు కోతులు కూర్చుని ఉన్నాయి. వాటిలో ఒకటి మరో కోతి కంటిని తెగ పరీక్షిస్తోంది. ఓ డాక్టర్‌లా రకరకాల యాంగిల్స్‌లో కంటిని పరిశీలిస్తోంది.
ఈ క్రమంలో ఓ ఆకును సాధనంగా వాడుకుంది ఆ కోతి. మొదట అక్కడ దొరికిన ఓ గ్రీన్ కలర్ ఆకును తీసుకొని కంటిని క్లీన్‌చేసింది. తర్వాత మరో ఆరెంజ్ కలర్ ఆకును తీసుకొని కంటిని మరోసారి క్లీన్ చేసింది. ఆ కోతి కంటిని పరీక్షిస్తున్న తీరు చూస్తే ఐ స్పెషలిస్ట్‌కి ఏమాత్రం తీసిపోదనిపిస్తుంది. ఇక అడవిలో జంవులన్నీ ఈ డాక్టర్ కోతి వద్దకు వైద్యానికి క్యూకట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్‌లో ఉందిమరి ఆ కోతిగారి ట్రీట్‌మెంట్.
View this post on Instagram
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా ఇప్పటికే ఈ వీడియోను 63 వేలమందికి పైగా వీక్షించి, లైక్ చేశారు. అంతేకాదు, తమదైన శైలిలో ఫన్నీకామెంట్స్‌తో హోరెత్తించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..