Viral Video: వామ్మో.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. ఏకంగా మొసలి పిల్లనే మచ్చిక చేసుకున్నాడుగా

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఐదేళ్ల బాలుడు తన వీపుపై ఓ చిన్న పిల్లాడ్ని మోసుకెళ్తున్నట్టుగా ఓ క్రూర జంతువును మోసుకెళ్తున్నాడు. ఆ జంతువు మరేదోకాదు.. భయంకరమైన మొసలి పిల్ల.

Viral Video: వామ్మో.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. ఏకంగా మొసలి పిల్లనే మచ్చిక చేసుకున్నాడుగా
Kid Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2023 | 12:12 PM

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు మనం చూస్తుంటాం. కొన్ని వీడియోలు చాలా ఆహ్లాదాన్ని పంచితే మరి కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లుగగుర్పొడిచేలా ఉంటాయి. ఒక్కోసారి స్టన్నింగ్‌ వీడియోలు దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు.. రకరకాల కామెంట్లతో, రీ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఐదేళ్ల బాలుడు తన వీపుపై ఓ చిన్న పిల్లాడ్ని మోసుకెళ్తున్నట్టుగా ఓ క్రూర జంతువును మోసుకెళ్తున్నాడు. ఆ జంతువు మరేదోకాదు.. భయంకరమైన మొసలి పిల్ల. ఆ బాలుడు ఎంతో సునాయాసంగా దాన్ని తన వీపుపై మోసుకెళ్తుంటే.. ఆ మొసలి పిల్ల ఎంతో ఎంజాయ్‌ చేస్తుంది. ఆ కుర్రాడు మాత్రం నడవలేకపోతున్న తన చిట్టి తమ్ముడినో చెల్లినో ఎత్తుకుని తీసుకెళ్తున్నట్టుగా ఆ మొసలి పిల్లను తీసుకెళ్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 14 వేలమందికి పైగా వీక్షించి, లైక్‌ చేశారు. వీడియో చూస్తున్న నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఓరి బుడ్డోడా.. నువ్వు మామూలోడివి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. మొసలి స్విమ్మింగ్ చేసి చేసి అలసిపోయినట్టుంది అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..