Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: చిన్న టెక్నిక్ తో చిటికెలో పని.. రైతు తెలివికి నెటిజన్లు ఫిదా.. వీడియో చూసేయండి..

ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఏదైనా కొత్తగా, విభిన్నంగా చేయాలనే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. తమ ట్యాలెంట్ తో వారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఏ దేశానికైనా రైతులే ముఖ్యం. వారు బాగుంటేనే అన్ని రంగాలు స్ధిరమైన అభివృద్ధి కనబరుస్తుంటాయి. అందుకే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు కూడా విభిన్న కార్యక్రమాలు చేపడుతుంటారు. రైతులు.. కూడా వ్యవసాయం చేసే సమయంలో శాస్త్రీయతో పాటు సంప్రదాయ విధానాలను పాటిస్తుంటారు. వారు తమ పనిని సులభంగా చేసుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. […]

Trending: చిన్న టెక్నిక్ తో చిటికెలో పని.. రైతు తెలివికి నెటిజన్లు ఫిదా.. వీడియో చూసేయండి..
Farmer Technic
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2023 | 11:03 AM

ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఏదైనా కొత్తగా, విభిన్నంగా చేయాలనే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. తమ ట్యాలెంట్ తో వారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఏ దేశానికైనా రైతులే ముఖ్యం. వారు బాగుంటేనే అన్ని రంగాలు స్ధిరమైన అభివృద్ధి కనబరుస్తుంటాయి. అందుకే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు కూడా విభిన్న కార్యక్రమాలు చేపడుతుంటారు. రైతులు.. కూడా వ్యవసాయం చేసే సమయంలో శాస్త్రీయతో పాటు సంప్రదాయ విధానాలను పాటిస్తుంటారు. వారు తమ పనిని సులభంగా చేసుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చే విధానాలపై మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం రైతులకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ క్లిప్ ను చూసిన నెటిజన్లు.. ఆ రైతులను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో పొలానికి సంబంధించింది. అక్కడ టమెటా కోత జరుగుతోంది. చాలా మంది కూలీలు టమోటాలు కోసి, బుట్టుల్లో నింపుతున్నారు. వారికి పక్కనే సరకును లోడ్ చేసేందుకు ఓ కంటెయినర్ ఉంది. అయితే.. కూలీలు నింపిన టమోటా బుట్టలను కంటెయినర్ లో నింపడం చాలా కష్టతరమైనది. కానీ.. ఓ వ్యక్తి మాత్రం దానిని చాలా సునాయసంగా చేసేశాడు. బుట్టను ఎగరేసి.. టమోటాలు వెహికిల్ లో, బుట్ట కింద పడిపోయేలా టెక్నిక్ ఉపయోగించాడు. ఇలా చాలా సింపుల్ గా పని పూర్తి చేసుకున్నాడు. వీడియో చూస్తుంటే.. ఆ రైతు సైన్స్ లో పీహెచ్డీ చేశాడేమోననే ఫీలింగ్ కలుగుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై క్లారిటీ లేదు. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ అయింది. కొద్ది సమయంలో ఈ వీడియోకు అధిక సంఖ్యలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..