AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు మరోసారి కుట్ర.. ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

బీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసులో నిందితులపై నిజామాబాద్‌ రూరల్‌ పీఎస్‌లో FIR నమోదైంది. హత్య చేసేందుకు 60 వేల రూపాయలు సుగుణ సమకూర్చినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.

Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు మరోసారి కుట్ర.. ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..
Jeevan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Feb 18, 2023 | 5:41 PM

Share

బీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసులో నిందితులపై నిజామాబాద్‌ రూరల్‌ పీఎస్‌లో FIR నమోదైంది. హత్య చేసేందుకు 60 వేల రూపాయలు సుగుణ సమకూర్చినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కేసులో తమను కేసులో ఇరికించారని కక్ష పెంచుకుని డిటేనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్‌ సమకూర్చుకున్నారు. అయితే, పోలీసుల తనిఖీల్లో పేలుడు పదార్థాలు పట్టుబడటంతో కుట్రకోణం బయటపడింది. సుగుణ, ప్రసాద్‌గౌడ్‌పై 307 సెక్షన్‌కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ మహిళ ఇంట్లో శుక్రవారం పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు విషయాల గురించి ఆరాతీశారు. అయితే, గతేడాది ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరగ్గా.. ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తే మహిళ ఇంట్లో పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లుగా పోలీసులు నిర్ధారించారు. బొంత సుగుణ అనే మహిళ ఇంట్లో 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీటిని కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ గౌడ్ భద్రపరిచినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

కాగా, గతేడాది మెుదటిసారి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మెుదటిసారి హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించిన ప్రసాద్ గౌడ్‌ జీవన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తుపాకీ గురిపెట్టగా.. జీవన్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించడంతో సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రసాద్ గౌడ్ భార్య మాక్లుర్ మండలం కల్లేడ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఆమెకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో విభేదాలు ఉండటంతో ఆయనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..