Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cantonment Elections: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌.. ఏప్రిల్ 30న పోలింగ్..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సికింద్రాబాద్‌తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డు..

Cantonment Elections: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌.. ఏప్రిల్ 30న పోలింగ్..
Secunderabad Cantonment Boa
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 18, 2023 | 5:18 PM

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సికింద్రాబాద్‌తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ మిట్టల్ విడుదల చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఏప్రిల్30న ఎన్నికలు జరుగునున్నాయని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో మొత్తం 8 వార్డులున్నాయి. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. 2023 ఫిబ్రవరి 10న పాలక‌వర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి పాలకవర్గం గడువు తీరింది.

అనంతరం కేంద్రం నామినేటెడ్‌ సభ్యుడిని నియమించింది. బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని న్యాయస్థానాలు కూడా కంటోన్మెంట్‌ బోర్డును ఆదేశించాయి. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాను గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనం చేసేందుకు గానూ విధి విధానాలపై కొన్నిరోజుల కిందట కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రక్రియ ఊపందుకుంటుందనుకున్న తరుణంలో తాజాగా బోర్డు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.