మహానగరంలో మహా చోరీ.. రూ.7కోట్లు విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్..

చోరీకి గురైన ఏడుకోట్ల బంగారానికి బిల్లులున్నాయా అని ప్రశ్నించిన పోలీసులకు ఫిర్యాదు దారులు చెప్పిన సమాధానంగా వారు బిల్లులు లేవని చెప్పడంతో అసలు చోరీపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మహానగరంలో మహా చోరీ.. రూ.7కోట్లు విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్..
Gold Price
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 18, 2023 | 1:57 PM

హైదరాబాద్‌లో ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీకి గురైంది.. కారులో ఉన్న బంగారంతో డ్రైవర్‌ పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. చోరీ జరిగిన తీరు మాత్రమే కాదు..గోల్డ్‌ అమ్మకందారు తీరుపైనా కూడా ఇప్పుడు పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిన సంగతి నిజమే అయినా ఫిర్యాదు చెయ్యడంలో ఆలస్యం కావడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. దీంతో ఈ గోల్డ్‌ రాబరీ ఇప్పుడు అంతులేని మిస్టరీలా మారింది వ్యవహారం. అనేక అనుమానాలకు దారితీస్తున్న యవ్వారంపై పూర్తి వివరాల్లోకి వెళితే..

రాధిక అనే మహిళ మాదాపూర్‌లోని ఓ గెటెడ్ కమ్యూనిటీలో ఉంటోంది. ఆమె చీరాజాకెట్లు అమ్మినట్లు ఇంట్లో ఉండే గోల్డ్‌ బిజినెస్ చేస్తున్నారు. తన సర్కిల్లో లగ్జరీ పర్సనాలిటీలు, బంధువులు, స్నేహితులకు బంగారం అమ్ముతూ వస్తోంది. అందులో భాగంగానే మధురానగర్‌లో క్లయింట్‌కి 50లక్షల విలువైన బంగారాన్ని డోర్‌ డెలివరీకి పంపింది. అయితే అదే కారులో ఆరున్నర కోట్ల రూపాయల బంగారు నగలూ ఉన్నాయి. కొనడానికి వచ్చిన వ్యక్తిని కూడా ఆ కారులోనే కూర్చోబెట్టి డెలివరీకి పంపింది. తీరా మధురానగర్ లో ఇంటిదాకా వెళ్లిన తర్వాత కారులో కూర్చున్న వ్యక్తి కిందకు దికాడు. అతను అలా దిగాడో లేదో.. డ్రైవర్‌ మొత్తం బంగారంతో ఉండాయించాడు. ఇదే వ్యవహారమైతే పోలీసుల విచారణ స్టయిల్‌ కూడా చాలా స్పీడ్‌గా ఉండేది. కానీ ఫిర్యాదులోనే చాలా ఆలస్యమైంది

శుక్రవారం సాయంత్రం 5గంటల సమయంలో చోరీ జరిగింది. రాత్రి 11గంటల సమయంలో ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, చోరీకి గురైన ఏడుకోట్ల బంగారానికి బిల్లులున్నాయా అని ప్రశ్నించిన పోలీసులకు ఫిర్యాదు దారులు చెప్పిన సమాధానంగా వారు బిల్లులు లేవని చెప్పడంతో అసలు చోరీపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఏడుకోట్ల బంగారం కారులో ఎందుకు పెట్టారనే సందేహాలు సైతం పోలీసులు లేవనెత్తుతున్నారు. ఇంట్లో ఉండే కొందరు గృహిణిలు చీర, జాకెట్లు అమ్మడం చూశాం, కానీ బంగారాన్ని కూడా అమ్ముతారా? అది కూడా రోల్డ్‌ గోల్డ్‌, వన్‌గ్రామ్‌ గోల్డ్ కాదు.. సిసలైన బంగారం. ఏడుకోట్ల రూపాయల వర్త్ గోల్డ్‌ను కారులో పెట్టి వ్యాపారం చేసేంత అవసరం ఏమొచ్చింది. బిల్లులు లేవని చెబుతున్నారంటే అసలు ఆ గోల్డ్ ఎవరి దగ్గర కొన్నారు.. ? ఎవరెవరికి అమ్మారు?ఎన్నాళ్ల నుంచి సాగుతోంది బిజినెస్‌? ఇంతస్థాయిలో గోల్డ్ బిజినెస్‌కి లైసెన్స్‌లు, జీఎస్టీ చెల్లింపులు ఇవేమీ ఉండవా? చూడబోతే మొత్తం అంతా ఒక మిస్టరీలా ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..