AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basil leaves in skincare: తులసితో మీ చర్మానికి అద్భుతమైన ఉపయోగాలు.. ఇలా చేస్తే మెరిసిపోవటం ఖాయం..!

తులసి చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సున్నితమైన, పొడి చర్మం, మొటిమలు కలిగిన చర్మం లేదా వృద్ధాప్య ఛాయలు ఉన్న చర్మాన్ని కలిగి ఉన్నావారికి తులసి నివారణ అద్భుతంగా పనిచేస్తుంది. మీ రోజువారీ చర్మ సంరక్షణలో భాగంగా చేసుకుంటే చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో, యవ్వన మెరుపును అందించడంలో సహాయపడుతుంది. ఔషధ మొక్క అయిన తులసిని మీ అందం, చర్మ సంరక్షణ కోసం ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Jyothi Gadda
|

Updated on: Feb 18, 2023 | 12:31 PM

Share
తులసిలో ఉండే అధిక విటమిన్ సి మీ చర్మాన్ని సహజంగా ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి కలిసి డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తాయి. చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. తులసి సారం, తులసి నూనెతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మానికి కాంతి, ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది.

1 / 6
తులసిలో స్వాభావికంగా ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. ఇది చర్మానికి లోతైన పోషణను అందించగల ముఖ్యమైన నూనెలను కలిగి ఉంటుంది. ఇది పొడి బారిన చర్మం కోసం ఉపయోగించడానికి అద్భుతమైన పదార్ధం.

2 / 6
తులసి చర్మంపై చికాకును మాయం చేసి ప్రశాంతతనిస్తుంది. చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసిలో ఉండే యూజెనాల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలతో కూడిన సమ్మేళనం. ఇది చర్మంపై వాపు, మంటను తగ్గిస్తుంది. తులసిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని పర్యావరణ ఒత్తిళ్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

3 / 6
తులసి సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది మొటిమలకు సమర్థవంతమైన ఔషధంగా పని చేస్తుంది. దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా ఇది మొటిమలకు కారణమయ్యే క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి, రంధ్రాలు తెరుచుకోవడానికి సహాయపడుతుంది. తులసి సారం లేదా తులసి నూనెతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడితే మొటిమలను క్లియర్ చేయవచ్చు.

4 / 6
తులసిలోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఇన్‌ఫ్లేషన్, ఎరుపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ రెండూ వృద్ధాప్య రూపానికి కారణమవుతాయి. తులసి సారం లేదా నూనెతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా మీరు మీ చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

5 / 6
మీ రోజువారీ చర్మ సంరక్షణలో భాగంగా చేసుకుంటే చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో, యవ్వన మెరుపును అందించడంలో సహాయపడుతుంది. ఔషధ మొక్క అయిన తులసిని మీ అందం, చర్మ సంరక్షణకు దోహద పడుతుంది.

6 / 6