AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Benefits: వెల్లుల్లి ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు.. వారికి సంజీవని వంటిది..!

వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును కూడా నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

Garlic Benefits: వెల్లుల్లి ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు.. వారికి సంజీవని వంటిది..!
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2023 | 11:08 AM

Share

మనం చేసుకునే వంటల్లో దాదాపు అన్నింటిలో వెల్లుల్లి వేసుకుంటాం. వెల్లుల్లితో వంటలకు మరింత రుచి వస్తుంది. అలాంటి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే, శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి వెల్లుల్లి ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా వీటిలో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, అలిసిన్, అజోయిన్, ఎస్-ఇథైల్‌సిస్టీన్, డైల్‌సల్ఫైడ్ వంటి ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును కూడా నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగితే తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమతుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వెల్లుల్లిని నిమ్మరసంలో కలిపి తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత పచ్చి వెల్లుల్లి నేరుగా తినవచ్చు. ఇలా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు తగ్గుతాయి.

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా చేయడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. వెల్లుల్లి ప్రభావం శరీర వేడిని పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి, వీటిని చలి కాలంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే..
ఇవాళే OTTకి వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 9.6 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 9.6 రేటింగ్
రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం
రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం