ఛాయ్‌ ప్రియులకు అలర్ట్‌.. రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..?

అది కూడా పరిమిత మోతాదులో చక్కెరను వేసుకోవటం ఉత్తమం. ఈ అలవాటును అదుపు చేసుకోలేని వ్యక్తులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఛాయ్‌ ప్రియులకు అలర్ట్‌..  రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..?
Tea
Follow us

|

Updated on: Feb 18, 2023 | 10:24 AM

టీ లవర్స్‌ భారత్‌లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంటారు.. మనలో చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే బెడ్ మీద టీ తాగే అలవాటు కూడా కొందరికి ఉంటుంది. మరికొందరికి రోజుకు అనేక కప్పుల టీ తాగే అలవాటు ఉంటుంది. ఇంట్లో-ఆఫీసులో, బయట టీ తాగడం చాలా మందికి హాబీ. టీని ఇష్టపడే చాలా మంది ప్రజలు దాని అధిక వినియోగం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అస్సలు ఆలోచించరు. అందువల్లే రోజుకు ఎంతంటే అంత టీ లాగించేస్తుంటారు. అయితే, రోజుకు ఎన్ని కప్పుల టీ తాగడం మంచిదో తెలుసుకోండి. టీలో కెఫిన్, రిఫైన్డ్ షుగర్ ఉంటాయి. రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. రోజుకు 5 నుండి 10 కప్పుల టీ తాగితే, అది మీ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం.

టీ తాగడం హానికరం కాదు. ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ పరిమితికి మించి తాగితే మలబద్ధకం, గుండెల్లో మంట, ప్రేగు సంబంధిత సమస్యలు, ఎసిడిటీ, అధిక రక్తపోటు వంటి చెడు ప్రభావాలను కలిగిస్తుంది. రోజులో ఎక్కువ కప్పుల టీ తాగితే మీ శరీరంలో చక్కెర పరిమాణం పెరగడం సహజం. అటువంటి పరిస్థితిలో మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దాంతో మధుమేహం వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కొవ్వుగా మారుతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. పొత్తికడుపు చుట్టూ కొవ్వు కనిపిస్తుంది. దీంతో బరువు తగ్గడం కష్టమవుతుంది.

టీలో కెఫీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు తాజాదనాన్ని ఇస్తుంది. కానీ, మీరు టీకి బానిస అవుతారు. ఫలితంగా టీ తాగకపోతే మీరు విశ్రాంతి, తలనొప్పిని ఎదుర్కొంటారు. టీ మగతను ప్రేరేపిస్తుంది, కనుక ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. అయితే, 1 రోజులో ఎన్ని కప్పుల టీ తాగాలి అనే సందేహం కలుగుతుంది..అలాంటప్పుడు… ఆరోగ్యం కోసం మీరు రోజుకు 2-3 కప్పుల టీ తాగవచ్చు . అది కూడా పరిమిత మోతాదులో చక్కెరను వేసుకోవటం ఉత్తమం. ఈ అలవాటును అదుపు చేసుకోలేని వ్యక్తులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్