AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివుడికి తన కాలేయాన్ని దానం చేసిన పార్వతీ.. మహాశివరాత్రివేళ అర్ధనారీశ్వరుల యదార్థ ప్రేమకథ.. అద్భుతం

ఇక్కడ శివ జీవితాన్ని రక్షించడంలో అతని భార్య అక్షరాల పార్వతీదేవి పాత్ర పోషించింది. తన భార్యకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు శివుడు. ఈ మహా-శివరాత్రి సందర్భంగా తనకు లభించిన గొప్ప కానుక

శివుడికి తన కాలేయాన్ని దానం చేసిన పార్వతీ.. మహాశివరాత్రివేళ అర్ధనారీశ్వరుల యదార్థ ప్రేమకథ.. అద్భుతం
Parvati Donated Liver To Sh
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2023 | 7:52 AM

Share

ఓ జంట అద్భుతమైన ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. 21 ఏళ్ల మహిళ తన 29 ఏళ్ల భర్త 6 నెలలుగా నుంచి మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి చలించిపోయింది. భర్త లివర్ పాడైపోవటంతో భార్య తన కాలేయాన్ని అతనికి దానం చేసి అతని ప్రాణాలను కాపాడింది, అయితే ఈ శస్త్రచికిత్సలో అనేక అడ్డంకులు వచ్చాయి, వైద్యులు ఎంతో శ్రమించి గానీ, ఆపరేషన్‌ సక్సెస్‌ చేశారు. వారి బ్లడ్ గ్రూప్ అసమతుల్యత ఉన్నప్పటికీ వారు విజయవంతంగా కాలేయ మార్పిడిని పూర్తి చేశారని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

మనదేశంలో భార్యాభర్తల మధ్య సంబంధం చాలా పవిత్రమైనది. అందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ నిలిచింది బీహార్‌కు చెందిన ఓ జంట. బీహార్‌కు చెందిన శివకు కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్న భర్తతో కలిసి భార్య ఆస్పత్రికి చేరుకోగా.. లివర్ ఫెయిల్యూర్ కారణంగా భర్త స్పృహ తప్పి తేలింది. శివ ఒక్కడే ఆ ఇంటికి ప్రధాన సంపాదకుడు. భార్యతో పాటు, ఇద్దరు పిల్లలు, వృద్ధ తల్లి బాధ్యతను కూడా అతడే చూసుకోవాలి. కానీ, ఇప్పుడు మంచంపట్టాడు. అయితే, శివకు కాలేయ మార్పిడికి దాత దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శివ బ్లడ్ గ్రూప్B పాజిటివ్‌. కుటుంబ సభ్యుల ఎవరి బ్లడ్‌ గ్రూప్‌ తనతో సరిపోలేదు. దాంతో శివ భార్య తన భర్తకు లివర్ ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ ఆమె బ్లడ్ గ్రూప్ A పాజిటివ్‌.

రక్త సమూహం సరిపోలకపోవడంతో శివ లివర్ మార్పిడి కష్టమన్నారు వైద్యులు. కానీ అసాధ్యం కాదు. ఈ మార్పిడిని పెద్ద ఆసుపత్రిలో చేస్తారని తెలిసింది. దాంతో ఆపరేషన్‌ కోసం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆపరేషన్‌కు ముందు చేయాల్సిన అన్ని టెస్టులు చేశారు వైద్యులు. ఆ తర్వాత శివ బ్లడ్ గ్రూప్‌లోని యాంటీబాడీలకు ముందుగా చికిత్స అందించారు.  21 మంది వైద్య బృందం, ఇతర సాంకేతిక నిపుణులు కలిసి 12 గంటల పాటు శ్రమించి  సర్జరీని సక్సెస్ చేశారు. రెండు వేర్వేరు బ్లడ్ గ్రూపులు కలిగిన వ్యక్తుల లివర్ మార్పిడి వైద్యులకు సవాలుగా మారింది. కానీ, ఎట్టకేలకు శస్త్రచికిత్స విజయవంతమైంది. సర్జరీ మరుసటి రోజు శివ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇక్కడ శివ జీవితాన్ని రక్షించడంలో అతని భార్య అక్షరాల పార్వతీదేవి పాత్ర పోషించింది. తన భార్యకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు శివుడు. ఈ మహా-శివరాత్రి సందర్భంగా తనకు లభించిన గొప్ప కానుక ఇదేనని శివ సంతోషం వ్యక్తం చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..