AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేక్కడి వింత ఆచారంరా బాబోయ్.. పెళ్లికొడుక్కి వింతగా వెల్కమ్ చెప్పిన అత్తామామలు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు ఇది పూర్తిగా అర్ధంలేనిది. అంటూ కొట్టి పారేస్తున్నారు..

ఇదేక్కడి వింత ఆచారంరా బాబోయ్.. పెళ్లికొడుక్కి వింతగా వెల్కమ్ చెప్పిన అత్తామామలు..
Trending Video
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2023 | 2:26 PM

Share

వరుడు సిగరెట్ తాగడం: భారతదేశం పురాతన కాలం నుండి అనుసరిస్తున్న సంస్కృతి, సంప్రదాయాల దేశం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు వేర్వేరు సందర్భాలలో వేర్వేరు సంప్రదాయాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వివాహలకు సంబంధించిన వివిధ వర్గాల్లో విభిన్న ఆచారాలు పాటిస్తారు. ఇక్కడ కూడా అలాంటి ఒక వింత సంప్రదాయం పాటిస్తున్నారు. పెళ్లికొడుకును సిగరెట్, పాన్‌తో స్వాగతం పలికిన అత్తగారి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కొన్ని చోట్ల అనాదిగా వస్తున్న ఆచారమని పలువురు సూచించగా.. తక్షణం ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని మరికొందరు అన్నారు. వీడియో చూసిన జనాలు అత్తగారు ఇదంతా చేయడానికి ఎలా సిద్ధమయ్యారు అని ఆశ్చర్యపోతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో వరుడు సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు మామగారు మర్యాదపూర్వకంగా సిగరెట్‌ వెలిగించాడు. అత్తగారు ఆ సిగరెట్‌ను కొత్త అల్లుడికి నోటికి అందిస్తుంది. దానికి అతడు.. ఒక పఫ్‌ లాగించి ఆ వెంటనే తిరిగి మామగారికి తిరిగి ఇచ్చేశాడు. అతడు ఆ పక్కనే ఉన్న అమ్మాయికి అందించి పక్కన పెట్టేశారు.. ఆ తర్వాత ఆచారం ప్రకారం వరుడు ఇద్దరికీ కొంత డబ్బు ఇస్తాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సంప్రదాయం గురించి వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఘటన జరిగిన ప్రదేశం గురించి తెలియనప్పటికీ, ఈ ఆచారం గుజరాత్‌లో జరిగి ఉండవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Joohi K Patel (@joohiie)

ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు ఇది పూర్తిగా అర్ధంలేనిది. ధూమపానం క్యాన్సర్‌కు కారణమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేస్తున్నారంటూ మరికొందరు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..