AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాము, పక్షి పోరాటం.. ఎవరు గెలుస్తారో వీడియో చూడండి..

పాము, పక్షి పోరాటాన్ని గమనించిన ఒక పర్యాటకుల బృందం ఇదంతా వీడియో తీశారు. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

Viral Video: పాము, పక్షి పోరాటం.. ఎవరు గెలుస్తారో వీడియో చూడండి..
Snake And Bird Fight
Jyothi Gadda
|

Updated on: Feb 17, 2023 | 1:23 PM

Share

పాములు సాధారణంగా కప్పలు, చిన్న చిన్న పక్షులు, కీటకాలు, చిన్న జంతువులను వేటాడతాయి. పాములు ముందుగా తమ విషంతో ఎరను మట్టుబెడతాయి. కొన్ని సందర్భాల్లో పాములు కొన్నింటిని సజీవంగానే మింగేస్తాయి. అయితే ఇప్పుడు పాముకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతూ వీక్షకులను షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఇందులో ఒక చిన్న పక్షి పాము తల వంచేలా చేసింది. ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోను ఫీల్డ్ గైడ్ పీటర్ వాన్ వైక్ రికార్డ్ చేశారు. వీడియోలో మీరు పాము ఎర కోసం వెతుకుతున్నట్లు గమనించవచ్చు. అప్పుడు అది ఒక పక్షిని చూసింది. వెంటనే పక్షిపై దాడి చేసేందుకు వేగంగా ప్రయత్నించింది. కానీ, ఆ బుల్లి పక్షి ముందు పాము తలవంచాల్సి వచ్చింది.

పాము పక్షిపై దాడి చేయబోతుండగా ఆ పక్షి పాముని బెదరగొట్టేసింది. పాముపై తన ముక్కుతో దాడి చేస్తుంది. పక్షిని పట్టుకునేందుకు పాము ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పక్షి దాడిలో ఆ పాము కంటికి గాయం కావడంతో పాము కుప్పకూలింది. ఈ పోరాటంలో పక్షి పామును పూర్తిగా ఓడించింది. పక్షి పాముపై చాలాసార్లు దాడి చేసింది. దీంతో పాము అప్పటికే సగం చనిపోయినట్లు కనిపిస్తోంది. పాము, పక్షి పోరాటాన్ని గమనించిన ఒక పర్యాటకుల బృందం ఇదంతా వీడియో తీశారు. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అంత చిన్న పక్షి పామును ఎలా చంపేసిందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ ప్రమాదకరమైన పక్షి పేరు గ్రే హెడ్డ్ బుష్‌ష్రైక్. ఆపద వచ్చిందంటే.. ఈ పక్షి పాములను వదలదు. బుష్‌ష్రైక్ పామును సగం చచ్చిపోయి తర్వాతే వదిలేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం