Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మావోయిస్టుల బీభత్సం.. బాంబులతో పంచాయతీ భవనాన్ని పేల్చి.. కరపత్రాలు విడుదల..!

మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరంతర ప్రచారం నిర్వహించడం ద్వారా పోలీసులు చాలా మంది మావోయిస్టులను హతమార్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతీకారంగానే మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అంటున్నారు.

మావోయిస్టుల బీభత్సం.. బాంబులతో పంచాయతీ భవనాన్ని పేల్చి.. కరపత్రాలు విడుదల..!
Naxalites Blow
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 17, 2023 | 12:46 PM

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోమారు తమ ఉనికిని చాటుకున్నారు. మావోయిస్టులపై నిరంతర ఆపరేషన్ తర్వాత చైబాసా జిల్లాలో మావోయిస్టులు తమ పంజా విసిరారు. జిల్లాలోని ఒక పంచాయతీ భవనాన్ని IED బాంబులతో పేల్చివేశారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ పేరు చెప్పుకుని మావోయిస్టులు తమ డిమాండ్‌ను పంచాయతీ తలుపులకు అంటించి వెళ్లారు. గోయిల్‌కెరా పంచాయితీ భవన్‌లో పేలుడు తర్వాత, ఫిబ్రవరి 12 నుండి 21 వరకు రాష్ట్రవ్యాప్త ప్రతిఘటన దినోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు మావోయిస్టులు. CPI మావోయిస్టు జిందాబాద్, PNGEA జిందాబాద్ అనే నినాదాలను తలుపులు, గోడలపై రాశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రశ్నిస్తూ.. మావోయిస్టులను తరిమికొట్టే పేరుతో పోలీసులు, పారామిలటరీ బలగాలు కొల్హాన్ గిరిజనులను ఎందుకు క్రూరంగా హింసిస్తున్నారని, కొల్హాన్ గ్రామాలు, అడవులపై ఎందుకు బాంబు దాడి చేస్తున్నారని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించారు.

గత 2 నెలలుగా మావోయిస్టులు భద్రతా బలగాలను నేరుగా టార్గెట్ చేస్తూ వస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ పోలీసుల ప్రచారంతో ప్రజల్లో విశ్వాసం నింపలేకపోయారని అన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరంతర ప్రచారంతో ఇప్పటికే  చాలా మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతీకారంగానే మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అంటున్నారు.

ఇకపోతే, జిల్లాలో మావోయిస్టుల ఆగడాలు కొనసాగుతున్నాయి. గత నెల రోజులుగా మావోయిస్టులు అరడజనుకు పైగా ఐఈడీలను పేల్చి భద్రతా బలగాలకు బహిరంగంగా సవాల్ విసురుతున్నారు. మావోయిస్టుల దాడిలో దాదాపు 12మంది జవాన్లు, స్థానికులు కూడా గాయపడ్డారు. దీని వల్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థనే కాదు, పోలీసుల పని తీరు కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..