5వేల ఏళ్ల క్రితమే పార్టీలు, పబ్‌ కల్చర్‌..! తవ్వకాల్లో బయటపడ్డ రెస్టారెంట్‌, బీరుబాటిళ్లు..!!

ఇది  రాజవంశ కాలంలో పారిశ్రామిక కేంద్రంగా ఉండేదని తెలిసింది. ఇది ఆర్థిక, రాజకీయ, మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. ఇక్కడ నివసించే ప్రజలు పశువుల పెంపకంతో పాటు చేపలు పట్టడం, వ్యవసాయం చేసేవారని తెలిసింది.

5వేల ఏళ్ల క్రితమే పార్టీలు, పబ్‌ కల్చర్‌..!  తవ్వకాల్లో బయటపడ్డ రెస్టారెంట్‌, బీరుబాటిళ్లు..!!
5 Thousand Years Ago People
Follow us

|

Updated on: Feb 17, 2023 | 9:13 AM

5000 సంవత్సరాల క్రితం భూమిపై నివసించే వారి జీవితం ఎలా ఉండేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేడు ఈ యుగంలో వినోదం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, పూర్వ కాలంలో ప్రజలు వినోదం కోసం ఏం చేసేవారు? దీనిపై మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనికి సమాధానం దొరికింది. ఇరాక్‌లో చేపట్టిన త్రవ్వకాలలో 5,000 సంవత్సరాల నాటి పబ్, రెస్టారెంట్ అవశేషాలు కనుగొనబడ్డాయి. నివేదిక ప్రకారం, దక్షిణ ఇరాక్‌లో త్రవ్వకాలలో పరిశోధకులు కొన్ని కీలక విషయాలను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ తర్వాత 2700 BCలో నివసించే సాధారణ ప్రజల జీవితం ఎలా ఉండేది. తవ్వకాల్లో మట్టి పొయ్యి, ఫ్రీజర్, రెస్టారెంట్, పబ్ ఆనవాళ్లను కనుగొన్నారు. చేపల అవశేషాలను కలిగి ఉన్న శంఖాకార గిన్నెలను పరిశోధకులు గుర్తించారు.

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయం నుండి సంయుక్త బృందం చేపట్టిన పరిశోధనలో.. పురాతన శీతలీకరణ వ్యవస్థ (ఫీజర్‌), పెద్ద ఓవెన్,  ఇక్కడి వచ్చే వారంతా కూర్చుని పార్టీని ఎంజాయ్ చేసేలా బెంచీలు, 150 సర్వింగ్ బౌల్స్ అవశేషాలను గుర్తించారు. ఈ క్రమంలోనే తవ్వకాల్లో బీర్ ఆధారాలు కూడా గుర్తించారు. దీని ఆధారంగానే 5000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు బీరు తాగేవారని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ హోలీ పిట్‌మాన్ ప్రకారం.. ఫ్రిజ్‌లు, వందలాది కంటైనర్లు, ప్రజలు కూర్చోవడానికి బెంచీలు కనిపెట్టినట్టుగా చెప్పారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు విశ్రాంతిని పొందేవారిని భావిస్తున్నట్టుగా వారు వెల్లగించారు.

లగాష్ అని పిలువబడే 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పురావస్తు ప్రదేశంలో ఈ ఆవిష్కరణ జరిగింది . ఇది  రాజవంశ కాలంలో పారిశ్రామిక కేంద్రంగా ఉండేదని తెలిసింది. లగాష్ దక్షిణ మెసొపొటేమియాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. ఇది ఆర్థిక, రాజకీయ, మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. ఇక్కడ నివసించే ప్రజలు పశువుల పెంపకంతో పాటు చేపలు పట్టడం, వ్యవసాయం చేసేవారని తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..