అతడికి ఆకలి వేసిందా..? ఇక అంతే.. టూత్‌ బ్రష్‌, జిప్‌లు, బట్టలు మాయం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రభుత్వాసుపత్రి ప్రిన్సిపల్ నారాయణసామి, ప్రిన్సిపల్ డాక్టర్, జనరల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ సర్జన్, “శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అతను ప్రస్తుతం మానసిక చికిత్స పొందుతున్నాడని చెప్పారు. 

అతడికి ఆకలి వేసిందా..? ఇక అంతే.. టూత్‌ బ్రష్‌, జిప్‌లు, బట్టలు మాయం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Man Eaten Toothbrush
Follow us

|

Updated on: Feb 17, 2023 | 8:43 AM

సామాన్యులు ఎవరికైనా సరే.. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం, సాంబారు, స్నాక్స్ వంటి ఆహారాన్ని తింటారు. అయితే ఆకలేసినప్పుడు టూత్ బ్రష్, జిప్, బట్టలు వంటివి తినే వాళ్లు కూడా ఉన్నారు.. అలా కనిపించిన వస్తువులు తిన్న ఓ వ్యక్తి చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది గత నెల 30న సింగ పెరుమాళ్ ఆలయానికి చెందిన శంకర్ (24) అనే యువకుడు కడుపునొప్పితో ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ నిజం బయటపడింది.

ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న శంకర్ మద్యానికి బానిసై గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు చెన్నైలోని ఓ ప్రైవేట్ పునరావాస కేంద్రంలో చేరాడు. ఈ సమయంలో పునరావాస కేంద్రంలో మానసిక ఒత్తిడికి గురై టూత్ బ్రష్, జిప్, క్లాత్, ప్లాస్టిక్ ఫైబర్ వంటి తినకూడని వస్తువులన్నీ మింగేశాడు.

దీంతో రెండు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో అవస్థలు పడుతున్నాడు. అతడి ఇబ్బంది చూసి ఎన్నో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా ఉపశమనం లభించలేదు. దీంతో గత నెలలో చెంగల్ పట్టు ప్రభుత్వాసుపత్రిలో సర్జరీ విభాగంలో చేరాడు.. పరీక్షించిన వైద్యుడు సీటీ స్కాన్ చేసి ఎండోస్కోపీ చేయగా కడుపులో టూత్ బ్రష్, ప్లాస్టిక్ కర్ర, చిరిగిన బట్టలు, జిప్ తదితరాలు కనిపించాయి. వెంటనే అతనికి శస్త్రచికిత్స చేశారు. జనరల్ సర్జన్ శంకర్ కడుపుకు శస్త్ర చికిత్స చేసి కడుపులోని పదార్థాలను తొలగించారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రి ప్రిన్సిపల్ నారాయణసామి, ప్రిన్సిపల్ డాక్టర్, జనరల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ సర్జన్, “శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అతను ప్రస్తుతం మానసిక చికిత్స పొందుతున్నాడని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
తీగ లాగితే.. డొంక అంతా కదిలింది.. పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు..
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి
ఈ సంకేతాలు ఉంటే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే.. ధైర్యం ఉంటేనే చదవండి