Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-పాక్ సరిహద్దులో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం.. అసలు ఉద్దేశం ఏంటంటే..!

జమ్మూ, కాశ్మీర్‌లో ఇప్పటికే భారతీయ సైన్యం శివాజీ మహారాజ్ రెండు అధికారిక విగ్రహాలను కలిగి ఉంది. జనవరి 2022లో, ఆర్మీకి చెందిన మరాఠా రెజిమెంట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రెండు విగ్రహాలను ఏర్పాటు చేసింది.

భారత్-పాక్ సరిహద్దులో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం.. అసలు ఉద్దేశం ఏంటంటే..!
Statue Of Chhatrapati Shiva
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 16, 2023 | 1:59 PM

భారత్-పాకిస్థాన్ మధ్య నియంత్రణ రేఖపై ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఎన్జీవో ‘అమీ పుణేకర్’ ఎన్జీవో ప్రకటించింది. ఫిబ్రవరి 14, 2023న, నియంత్రణ రేఖకు ఇరువైపులా శివాజీ విగ్రహాన్ని నిర్మిస్తామని NGO ఈ ప్రకటనను విడుదల చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యావత్‌ దేశానికి కీర్తి ప్రదాత. చాలా మంది వీర యోధులు అతని నుండి ప్రేరణ పొందుతారు.  శత్రువుపై పోరాడే సైనికులు ప్రతిరోజూ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చూడటం ద్వారా అతని ఆదర్శాలు, నైతిక విలువల నుండి ప్రేరణ పొందుతారని, శివాజీ మహారాజ్‌ శత్రువుపై చూపిన ధైర్యాన్ని గుర్తు చేసుకుంటారన్నదే విగ్రహ ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.  NGO ప్రకారం, శత్రువులతో పోరాడుతున్న సైనికులు విగ్రహాన్ని చూడటం ద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలు, నైతిక విలువల నుండి ప్రేరణ పొందేలా చూడటం దీని లక్ష్యం. అదే సమయంలో సైనికులు అతని ధైర్యాన్ని గుర్తుచేసుకుంటారు. శత్రువులతో పోరాడటానికి ప్రేరణ పొందుతారు. నివేదికల ప్రకారం, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కిరణ్, తంగ్‌ధర్-తిత్వాల్ లోయలలో ఏర్పాటు చేయనున్నారు.

కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ సాగర్ దత్తాత్రేయ దోయ్‌పోడే అనుమతితో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అటకేపర్ స్మారక కమిటీ అధినేత అభయ్‌రాజ్ షిరోలే, నాము పుణేకర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు హేమంత్ జాదవ్ ఈ ప్రణాళికను రూపొందించారు. దీనిపై హేమంత్ జాదవ్ వివరాలు తెలియజేస్తూ.. మార్చి నెలాఖరులోగా విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ నిర్వహిస్తామన్నారు. శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు భూమి పూజ కోసం అమ్హి పుణేకర్ ఎన్జీవో రాయ్‌గడ్, తోరన్, శివనేరి, రాజ్‌గడ్, ప్రతాపగడ్ కోటల నుండి మట్టి, నీటిని కాశ్మీర్‌కు తీసుకువెళుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన వ్యూహం, సాహసంతో శత్రువులను తరిమికొట్టాడు. ప్రపంచంలోని వివిధ దేశాలు శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధ వ్యూహాలను అనుసరిస్తాయి.

ఈ మేరకు అభయ్ రాజ్ శిరోలె మాట్లాడుతూ శివరాయల ఆదర్శాలు, స్ఫూర్తితో సరిహద్దుల్లోని భారత సైనికులకు స్ఫూర్తిని నింపేందుకు భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

జమ్మూ, కాశ్మీర్‌లో ఇప్పటికే భారతీయ సైన్యం శివాజీ మహారాజ్ రెండు అధికారిక విగ్రహాలను కలిగి ఉంది. జనవరి 2022లో, ఆర్మీకి చెందిన మరాఠా రెజిమెంట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రెండు విగ్రహాలను ఏర్పాటు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..