బరువు తగ్గడానికి ఎప్పుడు వ్యాయామం చేయాలి..? పరిశోధకులు ఏం చెబుతున్నారు..

దీనిపై పరిశోధకులు ఉన్నత స్థాయి అధ్యయనం చేశారు. కొందరు సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయాలనుకుంటే, మరికొందరు ఉదయం పూట వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు.

బరువు తగ్గడానికి ఎప్పుడు వ్యాయామం చేయాలి..? పరిశోధకులు ఏం చెబుతున్నారు..
Exercise
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 16, 2023 | 1:34 PM

ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అయితే వారి బరువు తగ్గడమే కాదు.. డైట్ మార్చుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గడంలో ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది వ్యాయామం చేసే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం వ్యాయామం చేయడం వల్ల సాయంత్రం కంటే రెండు రెట్లు వేగంగా బరువు తగ్గుతారు.. దాని గురించి పరిశోధన ఏమి చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరికి వ్యాయామం కోసం వారికి అనుకూలమైన సమయాన్ని కేటాయిస్తుంటారు. కొందరు సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయాలనుకుంటే, మరికొందరు ఉదయం పూట వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. ఉదయం, సాయంత్రం సమయం దొరక్క కొందరు మధ్యాహ్నం వ్యాయామం చేస్తుంటారు. మిగిలిన రోజుల కంటే ఉదయాన్నే వ్యాయామం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మధ్యాహ్నం లేదా సాయంత్రం వర్కౌట్ చేయడం వల్ల ఉదయం వ్యాయామం చేసినంత కొవ్వు కరిగిపోదని చెబుతున్నారు.

దీనిపై పరిశోధకులు ఉన్నత స్థాయి అధ్యయనం చేశారు. ఉదయం వ్యాయామం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఉదయం ఎక్కువ సమయం వ్యాయామం చేయడం ద్వారా, ఒక వ్యక్తి సాయంత్రం కంటే వేగంగా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించగలుగుతాడు అని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పరిశోధనల ఆధారంగా ఉదయం వ్యాయామం మంచిదని సూచిస్తున్నాయి. శరీర మెటబాలిజంను పెంచడానికి కొవ్వును కరిగించడానికి ఉదయం వ్యాయామం చాలా బాగా పనిచేస్తుంది.. కానీ అర్థరాత్రి వ్యాయామం మీకు పెద్దగా ఉపయోగపడదు. మీరు బరువు తగ్గాలనుకుంటే, ఉదయం వ్యాయామం మీకు ఉత్తమ పరిష్కారం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…