Fuel Prices: చుక్కలనంటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ ఏకంగా రూ.22.20పెరిగింది..!

కొత్త ధరలు గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం వల్లే ఈ పెరుగుదల చోటుచేసుకుందని పేర్కొంది.

Fuel Prices: చుక్కలనంటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ ఏకంగా రూ.22.20పెరిగింది..!
Petrol, Diesel Price
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 16, 2023 | 1:18 PM

పాకిస్తాన్ తీవ్ర ఆర్దిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్‌ నుంచి పాలు, పిండి మొదలు ఉల్లిపాయల వరకు అన్నింటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌పై ప్రభావం చూపుతోంది. పన్నులతో కూడిన మినీ బడ్జెట్‌ను విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ బుధవారం రాత్రి పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.22.20 పెరిగిన తర్వాత రూ.272కి చేరిందని ఆర్థిక శాఖ మీడియా విడుదల చేసింది . డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం వల్లే ఈ పెరుగుదల చోటుచేసుకుందని పేర్కొంది.

డీజిల్, కిరోసిన్ కొత్త ధర.. హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు 17.20 పెరిగి రూ.280కి చేరింది. అలాగే కిరోసిన్ ధరలు లీటరుకు 12.90 పెరిగి రూ.202.73కి చేరాయి. అదేవిధంగా లైట్ డీజిల్ ఆయిల్ ధర రూ.9.68. పెంపుతో లీటరుకు రూ. 196.68 ఉంది. కొత్త ధరలు గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి..ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలి మినీ బడ్జెట్‌లో పన్నులను పెంచింది. తాజాగా ఇంధన ధరలూ భారీగా పెంచడంతో పాక్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

అలాగే కరాచీలో దుకాణదారులు పాల ధరలను లీటరు రూ.190 నుంచి రూ.210కి పెంచారు. లూజ్ మిల్క్, పాకెట్ పాలు అన్నింటి ధరలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. బ్రాయిలర్ చికెన్ గత రెండు రోజుల్లో కిలో రూ.30-40 పెరగడంతో ధర రూ.480-500కి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా