చికెన్ ప్రియులకు పండగలాంటి ముచ్చట ఇది..! దుకాణాల వద్ద భారీ క్యూలైన్లు..
మన పొరుగుదేశం పాకిస్థాన్‌లో చికెన్ ధరలు కొండెక్కి కూస్తున్నాయి. కానీ, మన పక్కనున్న ఏపీలో మాత్రం ధరలు భారీగా పతమయ్యాయి.
Updated on: Feb 16, 2023 | 12:28 PM

నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న చికెన్ ధరలు రూ.220 నుంచి అమాంతంగా రూ.160కు చేరాయి. కిలోకు దాదాపు దాదాపు రూ.60 తగ్గింది.

అయినప్పటికీ కొంతమంది రిటైల్ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోడిగుడ్డు ధరలు కూడా పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వంద కోడిగుడ్లు జనవరిలో రూ.555 ఉండగా, ప్రస్తుతం రూ.440 ఉంది. రిటైల్‌లో మాత్రం వ్యాపారులు ఒకటి రూ.6 నుంచి రూ.6.50 వరకు అమ్ముతున్నారు.

కోళ్ల రైతులకు ప్రస్తుత ధరలు గిట్టుబాటు కావటం లేదు. పిల్ల రేటు, ఫీడ్ రేటు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు, లేబర్ చార్జీలు పెరిగిపోయాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర ష్టాలు చవిచూస్తున్నామంటూ వాపోతున్నారు.

కోడిగుడ్డు ధరలు కూడా పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వంద కోడిగుడ్లు జనవరిలో రూ.555 ఉండగా, ప్రస్తుతం రూ.440 ఉంది. రిటైల్‌లో మాత్రం వ్యాపారులు ఒకటి రూ.6 నుంచి రూ.6.50 వరకు అమ్ముతున్నారు.

మరోవైపు చికెన్ ధరలు అమాంతంగా తగ్గుముఖం పట్టడంతో చికెన్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.