Anand Mahindra: భూకంప బాధితుల సేవలో భారత ఆర్మీ డాక్టర్ బీనా తివారీ.. మీరు మాకు గర్వకారణం అంటున్న ఆనంద్ మహీంద్రా
భూకంపం శిథిలాల నుంచి రక్షించిన చిన్నారితో ఉన్న డాక్టర్ బీనా తివారీ ఉన్న ఈ ఫోటో.. 'గ్లోబల్ ఇమేజ్ ఆఫ్ ఇండియా' అని పిలవడానికి ఈ ఫోటోకి అర్హత ఉందని ప్రశంసలను పొందుతుంది. భారత సైన్యం ప్రపంచంలోనే అతిపెద్దదని పేర్కొన్నారు.
భూకంపంతో అతకుతలం అయిన టర్కీ, సిరియా దేశాలకు అనేక దేశాలు అండగా నిలిచాయి. తమ తమ రెస్క్యూ సిబ్బంది సహాయం కోసం బాధిత ప్రాంతాలకు పంపించిన సంగతి తెలిసిందే.. మన దేశం కూడా రెస్క్యూ సిబ్బంది, మందు సామాగ్రి తదితర వస్తువులను టర్కీ, సిరియా దేశాలకు పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మంగళవారం నాడు భూకంపంతో అతలాకుతలమైన టర్కీ , సిరియాలో భారత సైన్యం చేస్తున్న సహాయక చర్యలను అభినందించారు. తాజా పేజీలో భారత ఆర్మీ డాక్టర్ బీనా తివారీ చిత్రాన్ని షేర్ చేశారు. ఈ ఫొటోలో డాక్టర్ బీనా తివారీకి ఓ టర్కీ మహిళ చెంపపై ముద్దు పెడుతున్న చిత్రాన్ని షేర్ చేశారు. ఇప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటో భారత సైన్యం అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ADG PI) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో “మేము శ్రద్ధ వహిస్తాము” అనే క్యాప్షన్ తో షేర్ చేశారు.
భూకంపం శిథిలాల నుంచి రక్షించిన చిన్నారితో ఉన్న డాక్టర్ బీనా తివారీ ఉన్న ఈ ఫోటో.. ‘గ్లోబల్ ఇమేజ్ ఆఫ్ ఇండియా’ అని పిలవడానికి ఈ ఫోటోకి అర్హత ఉందని ప్రశంసలను పొందుతుంది. భారత సైన్యం ప్రపంచంలోనే అతిపెద్దదని పేర్కొన్నారు. టర్కీలోని ఇస్కెండెరున్ నగరంలో భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆసుపత్రిలో డాక్టర్ బీనా తివారీ తన విధులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
“మేజర్ బీనా తివారీ ఇస్కేందెరున్‌లో భారత సైన్యం అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో శిధిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారికీ చికిత్సను అందిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో ఒకటి భారత ఆర్మీ అని.. మన రెస్క్యూ సిబ్బందికి రక్షణ, శాంతి పరిరక్షక కార్యకలాపాలలో దశాబ్దాల అనుభవం ఉంది. భారతదేశం గ్లోబల్ ఇమేజ్ కు ప్రతీక అని చెప్పారు.
Major Bina Tiwari with a rescued girl in the Hospital opened by the Indian Army in Iskenderun. We have one of the largest armies in the world. They have decades of experience in rescue & peacekeeping operations. This can, & should be, the global image of India. #TurkeyEarthquake pic.twitter.com/ego2HyH0b2
— anand mahindra (@anandmahindra) February 14, 2023
టర్కీలో భారత సైన్యం చేస్తున్న కృషిని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు. “ ఆపదలో ఉన్న పౌరులను రక్షించడంలో భారత సైన్యం గొప్పదనం.. మానవ స్పర్శ గొప్ప ఫోటో ఇది అని పేర్కొన్నారు. ఆశ, చిరునవ్వు కలిగించే సాయుధ దళాలు అందించిన ‘అసాధారణమైన సేవ’ అంటూ మరొకరు ప్రశంసించారు. ఎటువంటి విపత్తులైనా సరే భారత సైన్యం చేపట్టే రెస్క్యూ ఆపరేషన్లకు కృతజ్ఞతలు .. మీరు మాకు గర్వ కారణం అంటూ హర్షం వ్యక్తం చేశారు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ మాటలను ప్రస్తావిస్తూ.. మీరు మన దేశం అతిపెద్ద విజయాలలో ఒకటి.. మనకు 2వ అతిపెద్ద సాయుధ బలగాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు.
గత వారం టర్కీలో సంభవించిన భారీ భూకంపం .. ఐరోపా ప్రాంతంలో 100 సంవత్సరాల్లో ఏర్పడిన అతి భారీ భూకంపము అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం తెలిపింది. గత వారం సంభవించిన భూకంపం కారణంగా టర్కీలో 35,000 మందికి పైగా మరణించారని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటి వరకూ టర్కీలో ఇంతటి దారుణం జరగలేదని.. గత 100 సంవత్సరాల నుంచి ఇటువంటి ఘోరమైన విపత్తు టర్కీ చూడలేదని పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..