AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆ దేశంలో పక్షులు వింత ప్రవర్తన.. ముంచుకొస్తున్న విలయానికి సంకేతమని ప్రజల ఆందోళన

జపాన్ లోని క్యోటో నగరంలో గుమిగూడిన వేల సంఖ్యలో కాకులు ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జపాన్‌లోని హోన్షులో వేలాది కాకులు ఆకాశం మీదుగా ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపం వీధుల్లోకి వచ్చాయి.

Viral Video: ఆ దేశంలో పక్షులు వింత ప్రవర్తన.. ముంచుకొస్తున్న విలయానికి సంకేతమని ప్రజల ఆందోళన
Japanese Island
Follow us
Surya Kala

|

Updated on: Feb 14, 2023 | 1:50 PM

మనుషులకంటే అధికంగా ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి ఉందా అంటే.. అవుననే సమాధానం వస్తుంది. ప్రకృతి ప్రకోపాన్ని కాకులు , కుక్కలు వంటివి ముందుగానే గుర్తిస్తాయా.. సునామీ, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు కాకులు వింతగా ప్రవర్తించాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..తాజాగా జపాన్ లోని క్యోటో నగరంలో గుమిగూడిన వేల సంఖ్యలో కాకులు ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జపాన్‌లోని హోన్షులో వేలాది కాకులు ఆకాశం మీదుగా ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపం వీధుల్లోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హోన్షు ద్వీపంలోని వీధుల్లో పక్షులు ఒక రహస్యమైన రీతిలో ప్రవహిస్తున్నట్లు చూపిస్తుంది.

ఇదే విధంగా గత కొన్ని రోజుల క్రితం టర్కీలో విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు పక్షులు అసాధారణ ప్రవర్తనను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఆకాశంలో సంచరిస్తూ కనిపించాయి. అప్పుడు పక్షులు అలా అసాధారణ రీతిలో ప్రవర్తించడానికి కారణం భూకంపం వైపరీత్యాన్ని ముందుగానే గుర్తించడం అని కొందరు చెప్పారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు నవంబర్ 2022లో.. చైనాలో గొర్రెల గుంపు 10 రోజులకు పైగా నిరంతరం వృత్తాకారంలో నడిచిన వీడియోను గుర్తు చేసుకుంటున్నారు. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలోని వ్యవసాయ క్షేత్రం నుండి తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ విపత్తులను జంతువులు, పక్షులు ముందుగానే పసిగడతాయి అంటూ కామెంట్స్  చేస్తున్నారు. కనుక జపాన్ లో కూడా ఏదో ఘోరం జరగబోతుందని పక్షులు ముందుగానే గ్రహించాయంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..