Turkey Earthquake: శిథిలాల కింద ఉన్న ఇద్దరి బాలికలను గుర్తించిన రోమియో, జూలీలు.. రక్షించిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు
రోమియో, జూలీలు కోల్‌కతాలోని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు టర్కీలోని నూర్దగిలో టన్నుల కింద శిధిలాల నుండి ఇద్దరు బాలికలను సజీవంగా రక్షించడంలో బృందాలకు సహాయపడ్డాయి. టర్కీ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి భారత ప్రభుత్వం మూడు NDRF బృందాలను ఘజియాబాద్, కోల్‌కతా, వారణాసి నుండి పంపింది.
టర్కీ, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత నగరాలు మరుభూమిని తలిపిస్తున్నాయి. గత వారం రోజులుగా గాజియాంటెప్, హతయ్, నూర్దగి, మారష్ వంటి నగరాల్లోని ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గత వారంగా నూర్దగి నగరంలో మన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మందిని రక్షించడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందంతో సాయంగా రోమియో, జూలీలు నిలుస్తున్నాయి. కూలిపోయిన ఇళ్ల శిథిలాల కింద ఉన్న బాలికను రోమియో, జూలీ లాబ్రడార్ ద్వయం పసిగట్టాయి. వెంటనే అవి మొరిగి.. ఆర్మీ బృందాన్ని అలెర్ట్ చేశాయి. దీంతో శిథిలాల కింద ఉన్న బాధితులను రక్షించడానికి ఆర్మీ బృందాలు యంత్రాలను తీసుకువచ్చి డ్రిల్లింగ్ ప్రారంభించాయి. గంటల తరబడి శ్రమించి ఆరేళ్ల బాలికను వెలికి తీశారు. వీరికి శ్రమకు ఫలితం దక్కుతూ ఆ బాలిక సజీవంగా ఉంది.
రోమియో, జూలీలు కోల్‌కతాలోని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు టర్కీలోని నూర్దగిలో టన్నుల కింద శిధిలాల నుండి ఇద్దరు బాలికలను సజీవంగా రక్షించడంలో బృందాలకు సహాయపడ్డాయి. టర్కీ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి భారత ప్రభుత్వం మూడు NDRF బృందాలను ఘజియాబాద్, కోల్‌కతా, వారణాసి నుండి పంపింది. ఈ రెస్క్యూ బృందంలో రెండు కుక్కలు కూడా ఉన్నాయి. రోమియో, జూలీల కారణంగా తాము ఇద్దరు పిల్లలను రక్షించగలిగామని.. ఫిబ్రవరి 9 న శిథిలాలలో వెదుకుతున్న సమయంలో బాలికను గుర్తించి రోమియో మొరిగింది. జూలీ జత చేరింది. గంటల తరబడి అక్కడ పరిశీలించిన తర్వాత.. కాంక్రీటుకు రంధ్రాలు వేసి ముక్కలు చేసి ఒక అమ్మాయిని బయటకు తీసుకొచ్చారు. ఆమె సజీవంగా ఉంది. మర్నాడు మరొకరు అక్కడ ఉన్నట్లు కనుగొన్నారు. ఇద్దరూ ఇప్పుడు బాగానే ఉన్నారని ఘజియాబాద్‌కు చెందిన 8వ NDRF బెటాలియన్‌కు చెందిన విపిన్ ప్రతాప్ సింగ్ చెప్పారు.
#WATCH | #TurkeyEarthquake | Sniffer dogs of NDRF, Julie and Romeo saved a six-year-old girl who was trapped under the debris at the earthquake-hit Nurdağı. pic.twitter.com/y931PMJz9z
— ANI (@ANI) February 13, 2023
వారణాసి నుండి వచ్చిన సిబ్బంది అంతక్యలో సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నారు. “సోమవారం తొమ్మిది మృతదేహాలను వెలికితీశాము” అని నూర్దగిలో 51 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తున్న 8వ బెటాలియన్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ దీపక్ తల్వార్ చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..