ఏం కొనేటట్టు లేదు.. లీటరు పాల ధర రూ. 210కి చేరింది.. అక్కిడి జనం అల్లాడిపోతున్నారు..

బోన్‌ లెస్‌ మాంసం ధర కిలోకు రూ. 1,000-1,100 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది, అదే సమయంలో కిలోకు రూ. 150-200 పెరిగింది. బోన్‌లెస్ కోడి మాంసం ధర ప్రస్తుతం కిలో రూ.900-1,000 వరకు విక్రయిస్తుండగా, విత్‌ బోన్‌ మాంసం కిలో రూ.800-850 వరకు విక్రయిస్తున్నారు.

ఏం కొనేటట్టు లేదు.. లీటరు పాల ధర రూ. 210కి చేరింది.. అక్కిడి జనం అల్లాడిపోతున్నారు..
milk
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 14, 2023 | 2:06 PM

భారతదేశంలో బిగ్‌బాస్కెట్‌లో చికెన్ కిలో ధర రూ. 250, బహిరంగ మార్కెట్‌లో కూడా ధరలు తక్కువగానే ఉన్నాయి. ఆన్‌లైన్ పాల ధర దాదాపు లీటరుకు 50ల నుంచి మొదలవుతుంది. దీన్ని ఆఫ్‌లైన్‌లో తక్కువ ధరలకు పొందవచ్చు. అయితే, సరిహద్దు దాటి వెళితే ధరలు రెట్టింపు అవుతాయి. శత్రుదేశమైన మన పొరుగుదేశంలో ఈ నెల ప్రారంభంలో లైవ్ కోడి కిలో రూ. 390-440కి అందుబాటులో ఉండగా, జనవరి, 2023 చివరి వారంలో రూ. 380-420 కిలోల మధ్య విక్రయించబడింది. కొన్ని రోజుల క్రితం కిలో రూ.620-650గా ఉన్న కోడి మాంసం ఇప్పుడు రూ.700-780కి విక్రయిస్తున్నట్లు తెలిసింది. బోన్‌ లెస్‌ మాంసం ధర కిలోకు రూ. 1,000-1,100 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది, అదే సమయంలో కిలోకు రూ. 150-200 పెరిగింది. బోన్‌లెస్ కోడి మాంసం ధర ప్రస్తుతం కిలో రూ.900-1,000 వరకు విక్రయిస్తుండగా, విత్‌ బోన్‌ మాంసం కిలో రూ.800-850 వరకు విక్రయిస్తున్నారు.

దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య కరాచీలో పాల ధర భారీగా పెరిగింది. లీటర్‌ పాల ధర రూ.210కి పెరిగింది. లీటర్‌ పాలు కొనుగోలు చేసేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తుందని, పిల్లలు సైతం పాలు దొరక్క ఇబ్బందులుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా పడిపోతున్నాయి.

ప్రస్తుతం మూడు బిలియన్ల కంటే తక్కువగానే ఉన్నాయి. మరో వైపు పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. వారిపై మరింత భారం పడబోతున్నది. రుణం కోసం ఐఎంఎఫ్‌ నిర్ధేశించిన షరతులతో ఈ కష్టాలు పెరుగనున్నాయి. రుణం కోసం సబ్సిడీలు తగ్గించాలని ఐఎంఎఫ్‌ సూచించింది.

ఇవి కూడా చదవండి

జీఎస్టీ పెంపు, పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో రక్షణ బడ్జెట్‌లో 10-15 శాతం వరకు కోత పెట్టాలని ఐఎంఎఫ్‌ షరతులపై ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖతో చర్చించింది. యుద్ధేతర బడ్జెట్‌లో కేవలం 5-10 శాతం మాత్రమే కోత విధించాలనే ఆర్మీ జనరల్‌ హెడ్‌క్వార్టర్స్‌ సూచనపై రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..