AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమానుషం.. వ్యక్తి మృతికి కారణమంటూ మహళపై దాడి.. మెడలో చెప్పుల దండవేసి..

ఈ క్రమంలోనే ఆ యువకుడి మృతికి... ఆమే కారణమంటూ బాధితురాలిపై దాడి చేశారు బంధువులు. అందరూ కలిసి ఆమెపై దాడిచేసి చెప్పుల దండేసి ఊరేగించారు.

అమానుషం.. వ్యక్తి మృతికి కారణమంటూ మహళపై దాడి.. మెడలో చెప్పుల దండవేసి..
Woman
Jyothi Gadda
|

Updated on: Feb 14, 2023 | 1:06 PM

Share

మనం అనాగరిక కాలంలో ఉన్నామో? ఆధునిక యుగంలో ఉన్నామో? మనల్ని మనమే ప్రశ్నించుకునే అమానుష ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళను మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. బాధితురాలి సమీప బంధువులే ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ దారుణమైన ఘటన సోమవారంనాడు మహబూబ్నగర్ జిల్లా డోర్నకల్ శివారు తండాలో జరిగింది. ఆమె కారణంగా ఒకరు మరణించారంటూ అకృత్యానికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ నెల 10న పట్టణ పరిధిలోని మున్నేరువాగు దగ్గర్లోని శివాలయం దగ్గర ఓ మృతదేహం దొరికింది. ఇది కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో మృతుడు డోర్నకల్ శివార్లలో ఉండే తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ యువకుడి మృతికి… ఆమే కారణమంటూ బాధితురాలిపై దాడి చేశారు బంధువులు. అందరూ కలిసి ఆమెపై దాడిచేసి చెప్పుల దండేసి ఊరేగించారు.

మహిళను అవమానపరిచిన విషయం తమ దృష్టికి రాలేదని డోర్నకల్ సీఐ వెంకటరత్నం వెల్లడించారు. కాగా, కుళ్ళిన మృతదేహాన్ని గుర్తించే కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ..