డయాబెటిస్ బాధితులకు తీపి కబురు.. ! మీ కోసమే ఈ కొత్త యాప్.. ఎలా పనిచేస్తుందంటే..
మధుమేహానికి సంబంధించిన ఏలాంటి సందేహాలకైన సరే నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి MV DIABET అప్లికేషన్ ప్లే స్టోర్‌లో కొత్తగా అందుబాటులో వచ్చింది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీపి కబురు. షుగర్ బాధితులకు ఊరటనిస్తూ.. మీ కోసం ఒక యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఎలా పని చేస్తుంది. యాప్ వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే.. MV హాస్పిటల్, చెన్నై ప్రొఫెసర్ M విశ్వనాథన్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్, రాయపురం మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ఒక కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించాయి. దీని ద్వారా మీరు డయాబెటిస్‌కు సంబంధించిన ఏదైనా సమస్య లేదా పరిష్కారం కోసం నిపుణులతో సంప్రదించవచ్చు. మధుమేహానికి సంబంధించిన ఏవైనా సందేహాలపై నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి MV DIABET అప్లికేషన్ ప్లే స్టోర్‌లో కొత్తగా అందుబాటులో ఉంది.
ఈ అప్లికేషన్ శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా చీఫ్ డయాబెటీస్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఈ యాప్ వాట్సాప్ నంబర్‌కు కనెక్ట్ అయిందని, మీ సమస్యలు లేదా సందేహాలన్నింటినీ మా బృందం పరిష్కరించగలదన్నారు. మధుమేహం ఉన్న రోగులు కొన్ని రకాల నరాల సంబంధిత వ్యాధులకు గురవుతారని చెప్పారు. ఇది అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు దారితీస్తుందన్నారు. ఇది ముఖ్యంగా కాళ్లలోని రక్తనాళాల గోడలకు నష్టం కలిగిస్తుందన్నారు. ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందని చెప్పారు.
ఈ తరహా సమస్యపై నిర్లక్ష్యం వహిస్తే సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న MV DIABET అనే యాప్ WhatsApp నంబర్‌కు కనెక్ట్ చేయబడింది. దీనివల్ల డయాబెటిక్ ఫుట్ డిసీజ్, డయాబెటిస్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..