AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇదేం కాంబినేషన్‌ బ్రో.. కొబ్బరి బోండాంలో ఇలా కలిపేస్తారా..? అదుర్స్‌ అంటున్న నెటిజనం..

చాలా మంది ప్రజలు దీనిని మొదటిసారిగా వింటున్నామని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి అంటూ మరికొందరు ట్విట్‌ చేశారు. వైరల్‌గా మారిన ట్వీట్‌ని చూసి కొందరు దీన్ని ప్రయత్నించి లైక్ చేసి రిపోర్ట్ చేశారు.

Viral News: ఇదేం కాంబినేషన్‌ బ్రో.. కొబ్బరి బోండాంలో ఇలా కలిపేస్తారా..? అదుర్స్‌ అంటున్న నెటిజనం..
Coconut And Lemon
Jyothi Gadda
|

Updated on: Feb 14, 2023 | 11:19 AM

Share

కొబ్బరి బోండాలు, జ్యూస్‌లు, షేక్స్, స్మూతీస్ లాంటివి ఈ రోజుల్లో చాలా ఫేమస్‌. పైగా ఎక్కడ పడితే అక్కడ సులువుగా దొరికిపోతున్నాయి. అయితే చాలా మంది కొబ్బరి బోండాలను యధాతథంగా తీసుకునేందుకు ఇష్టపడతారు. అదేవిధంగా కొబ్బరి నీళ్లలో మరోకటి కలపడం అనేది నిజంగా వింతగానే చెప్పాలి. అయితే, ముఖ్యంగా మన దేశ ప్రజలందరూ ఇష్టపడే పానీయాలలో కొబ్బరి నీళ్లు ఒకటి. సాంప్రదాయకంగా మనం కొబ్బరి నీళ్లను చల్లదనానికి ఉత్తమమైన నీరుగా, ఆరోగ్యకరమైన దాహాన్ని తీర్చేదిగా పరిగణిస్తాము.. వీధి మార్కెట్లలో కొబ్బరి బోండాలకు గిరాకీ మరీంత ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే, వచ్చేది వేసవికాలం కావటంతో కొబ్బరి నీళ్లకు మరింత డిమాండ్‌ పెరుగుతుంది. అయితే, మీరెప్పుడైనా కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం చూశారా..? లేదు కదా..? ఇదిగో ఇక్కడ ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక రోడ్‌సైడ్ స్టాల్స్‌లో ఇలాంటి వెరైటీ కొబ్బరి నీళ్లను విక్రయిస్తున్నారు.

అరుణ్‌ దేవ్ అనే ఓ ట్విటర్‌ యూజర్‌.. తాను కొబ్బరి బోండాంలో నిమ్మరసాన్ని కలుపుతూ దిగిన ఓ ఫొటోను తన మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేశాడు. ఆ ఫొటోకు ‘ఇది ఇంత పాపులర్‌ కాంబినేషన్‌ అని నాకు ఇప్పటిదాకా తెలియదు’ అంటూ ఇంగ్లిష్‌లో క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ఈ ఫొటో ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ ఫొటోను 1,13,100 మంది వీక్షించారు. 1100 మంది లైక్‌ చేశారు. పైగా కామెంట్ల వర్షం కురుస్తుంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన ఈ ఫోటోపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగటం ఇదే తొలిసారిగా చూస్తున్నామంటూ నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు దీనిపై పెద్ద చర్చే జరిగింది. చాలా టేస్టీగా ఉంటుందని, ఇంకా ఏం జోడించవచ్చని చాలా మంది తమ ఐడియాలను షేర్‌ చేసుకుంటున్నారు. ‘ఈ కాంబినేషన్‌ చాలా బాగుంటుంది. మంగళూరులో దీన్ని బోంబా లైమ్‌ అంటారు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మీరు కూడా ట్రై చేయండి అంటూ మరికొందరు ట్విట్‌ చేశారు. వైరల్‌గా మారిన ట్వీట్‌ని చూసి కొందరు దీన్ని ప్రయత్నించి లైక్ చేసి రిపోర్ట్ చేశారు.

తరచుగా ఇలాంటి కొన్ని వంటకాలు లేదా పానీయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతాయి. ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్న వైరల్‌ ‘డ్రింక్‌’ ఇదే.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..