34 ఏళ్ల మహిళ జనావాసాలు లేని జపాన్ ద్వీపాన్ని కొనుగోలు చేసింది.. ఇదంతా నాదేనంటూ..!

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో దీవులను కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇలాంటి ద్వీపాలు ప్లాట్ల మాదిరిగా విక్రయించబడ్డాయి.. ఫ్రీ హోల్డ్ లీజును పొందినప్పుడు, కొనుగోలుదారు ద్వీపంపై పూర్తి హక్కులను పొందుతాడు.

34 ఏళ్ల మహిళ జనావాసాలు లేని జపాన్ ద్వీపాన్ని కొనుగోలు చేసింది.. ఇదంతా నాదేనంటూ..!
Chinese Girl Buy Island
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 14, 2023 | 7:42 AM

ప్రపంచంలోని చాలా మందికి విషయాల పట్ల అభిరుచులు భిన్నంగా ఉంటాయి. వారు తమ అభిరుచిని నెరవేర్చుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక విభిన్నమైన పని చేయాలని కోరుకుంటారు. మరికొందరు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునేలా ప్రత్యేకంగా ఉంటారు. తాజాగా, చైనాలో నివసిస్తున్న 34 ఏళ్ల యువతి కూడా అలాంటి పనే చేసింది. ఈ అమ్మాయి జపాన్‌లోని ఒకినావా ప్రావిన్స్‌లోని ఒక దీవిని కొనుగోలు చేసింది. ఈ ద్వీపం ఒకినావా ప్రధాన ద్వీపానికి ఉత్తరాన ఉంది. టోక్యోకు చెందిన ఒక కన్సల్టెంట్ సంస్థ కూడా ఈ ద్వీపంలో కొంత భాగాన్ని కలిగి ఉంది.

జపాన్‌కు చెందిన టీనా జాంగ్ అనే అమ్మాయి ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసినట్టుగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, కొంతకాలం తర్వాత కంపెనీ తన గుర్తింపును వెల్లడించింది. అమ్మాయి కొనుగోలు చేసిన కంపెనీకి ఇప్పటికీ ఆ ద్వీపంలోని మొత్తం భూమిలో దాదాపు 50 శాతంపై యాజమాన్య హక్కులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గతంలో ఈ ద్వీపం ఫోటోలు, వీడియోలు @Byron_Wan హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో షేర్‌ చేయబడ్డాయి. వీడియోలో ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఆమె పేరు టీనా జాంగ్ అని తెలిసింది. ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆమె మొదటిసారి సందర్శించినప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసినట్టుగా చెప్పింది. ట్వీట్‌లో ఈ ద్వీపం పేరును యహానా ద్వీపం అని పేర్కొన్నారు. అమెరికాలోని కడెనా ఎయిర్ బేస్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో యనహా ద్వీపం ఉందని ఫోటో, వీడియో క్యాప్షన్‌లో వెల్లడించారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో దీవులను కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇలాంటి ద్వీపాలు ప్లాట్ల మాదిరిగా విక్రయించబడ్డాయి.. ఫ్రీ హోల్డ్ లీజును పొందినప్పుడు, కొనుగోలుదారు ద్వీపంపై పూర్తి హక్కులను పొందుతాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..