నిజమైన ప్రేమకథ.. యాసిడ్ దాడికి గురైన అమ్మాయితో ప్రేమలో పడ్డ యువకుడు.. పెళ్లి తర్వాత..

తరచూ ఆమె పరిస్థితి చూసేందుకు ఆస్పత్రికి వచ్చేవాడు.. డాక్టర్ల సాయంతో సరోజ్‌ ప్రమోదినిని 4 నెలల్లోనే తన కాళ్లమీద తాను నిలబడేలా చేశాడు. దాంతో రాణి ఆరోగ్యం కుదుటపడింది.

నిజమైన ప్రేమకథ.. యాసిడ్ దాడికి గురైన అమ్మాయితో ప్రేమలో పడ్డ యువకుడు.. పెళ్లి తర్వాత..
Love Wedding Story
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 13, 2023 | 1:21 PM

యాసిడ్ దాడి నుండి బయటపడిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గొప్ప మనసున్న ఓ యువకుడు. రౌల్ రాణి అనే యువతిని సరోజ్ సాహు అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2009 మే 4న ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ప్రమోదిని కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. యాసిడ్ దాడికి గురైన ఆ బాలిక శరీరం 80 శాతం వరకు కాలిపోయి కంటి చూపు కూడా కోల్పోయింది. ఆ అమ్మాయి జీవించాలనే కోరికను కూడా వదిలేసుకుంది. కానీ, దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆమె జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. ప్రమోదినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ఆమె జీవితానికి కొత్త వెలుగును పంచాడు. దాంతో ఆమె జీవితమే పూర్తిగా మారిపోయింది. ప్రేమికుల రోజు సందర్భంగా వారు తమ ప్రేమకథను షేర్‌ చేశారు.

యాసిడ్ దాడి నుండి బయటపడిన బాధితురాలు ప్రమోదిని రౌల్ రాణి, సరోజ్ సాహు ప్రేమ వివాహ కథవాస్తవానికి, 14 ఫిబ్రవరి 2018న అంటే వాలెంటైన్స్ డే రోజునే ప్రారంభమైంది. ఆ యాసిడ్ దాడి బాధిత బాలికకు తన ప్రియుడితో నిశ్చితార్థం జరిగింది. ఇద్దరూ మార్చి 1, 2021న వివాహం చేసుకున్నారు. అయితే, యాసిడ్ తర్వాత బాధితురాలు జీవితంలో ఊహించన ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. తీవ్రంగా గాయపడిన రాణి 9 నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయినప్పటికీ ఆమె కోలుకోలేదు. ఈ క్రమంలోనే వారి తల్లిదండ్రుల వద్ద డబ్బు లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చేశారు. 5 ఏళ్లుగా తాను మంచానికే పరిమితమైంది.

దాదాపు ఐదేళ్ల తర్వాత అంటే 2014లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాధితురాలిని చూసుకోవటానికి ఒక నర్సు ఆమె వద్దకు ఒక అబ్బాయిని తీసుకు వచ్చింది. అతనే సరోజ్ సాహు. 2014లో రాణిని కలిసిన సరోజ్‌.. తరచూ ఆమె పరిస్థితి చూసేందుకు ఆస్పత్రికి వచ్చేవాడు.. డాక్టర్ల సాయంతో సరోజ్‌ ప్రమోదినిని 4 నెలల్లోనే కాళ్లమీద నిలబడేలా చేశాడు. 2016లో రాణి తన చికిత్స కోసం ఢిల్లీకి వచ్చింది. అక్కడ ఆమెకు సంపూర్ణ చికిత్స ప్రారంభమైంది. కాగా సరోజ్‌ అప్పుడు ఒడిశాలో ఉండేవాడు. ఆ సమయంలో ఒరిస్సాలో ఉన్న సరోజ్‌ రాణి వెళ్ళిపోయిన తర్వాత చాలా మిస్ అవుతున్నానని, ఆమె లేకుండా జీవించలేనని తెలుసుకున్నాడు. దాంతో జనవరి 14న సరోజ్‌ రాణికి ఫోన్ చేసి.. ఆమె ముందు తన ప్రేమను వ్యక్తం చేస్తూ పెళ్లి చేసుకోవాలంటూ కోరాడు.

ఇవి కూడా చదవండి
Love Wedding

కొంతకాలం తర్వాత, కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న ప్రమోదిని కాస్త కోలుకుండి. కంటి చూపు 20 శాతానికి పైగా తిరిగి వచ్చింది. ఆ తర్వాత, రాణి మళ్లీ సరోజ్‌ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. వారిద్దరూ 14 ఫిబ్రవరి 2018న ఒక కేఫ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆపై మార్చి1, 2021న వివాహం చేసుకున్నారు. ఈరోజు వారిద్దరూ తమ జీవితాల్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు ఇదే నిజమైన ప్రేమంటే అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి ప్రేమకథపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…