AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు..! రాత్రి కేవలం 40నిమిషాలు మాత్రమే.. అద్భుతమైన టూరిస్ట్ స్పాట్..

ఇక్కడ కేవలం రెండు సీజన్లు మాత్రమే కనిపిస్తాయి. ఒకటి శీతాకాలం, రెండు వేసవి కాలం. అయితే, ఇక్కడ రాత్రి 6 నెలలు రాత్రి, పగలు 6 నెలలు పగలు ఉంటుంది. 76 రోజుల పాటు నిరంతరాయంగా పగలే ఉన్నప్పటికీ ఇక్కడ ఎండ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు..! రాత్రి కేవలం 40నిమిషాలు మాత్రమే.. అద్భుతమైన టూరిస్ట్ స్పాట్..
Sun Sets
Jyothi Gadda
|

Updated on: Feb 13, 2023 | 11:30 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు దాగివున్నాయి. మన చుట్టూ మనం చూడనివి, మాటల్లో వింటున్న ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక ఈ సృష్టిలో పగలు, రాత్రి ఒకదాని తర్వాత ఒకటి రావటం సహజనం. కానీ ప్రపంచంలో రాత్రి లేని, అతి తక్కువ రాత్రి సమయం కలిగిన దేశాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ? ఈ దేశంలో రాత్రి ఉదయం మధ్య వ్యత్యాసం కేవలం 40 నిమిషాలు మాత్రమే గల దేశం ఒకటి ఉంది. ఆ దేశం పేరు స్వాల్బార్డ్ నార్వే. నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో సూర్యుడు దాదాపు 12:43కి అస్తమించి, 40 నిమిషాల తర్వాత మళ్లీ ఉదయిస్తాడు. కంట్రీ ఆఫ్ మిడ్-నైట్ సన్ పేరుతో ఫేమస్ అయిన నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో కేవలం 40 నిమిషాల రాత్రి ఉంటుంది. ఇది ఏడాదిలో కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు మొత్తం రెండున్నర నెలల పాటు ఇక్కడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఈ దేశం చాలా ప్రత్యేకమైనది. ఈ కారణంగా దీనిని అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని కూడా పిలుస్తారు.

నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో సుమారు 76 రోజులు సూర్యుడు అస్తమించడు.ఈ 76 రోజులు మే నెల నుండి జూలై నెల వరకు వస్తుంది. ఈ కారణంగా, జూన్ 21 రోజు నుంచి డిసెంబర్ 22 రాత్రి వరకు రాత్రులు చాలా చిన్నవి. ఇకపోతే, మనందరికీ తెలిసినట్టుగా భూమి తన అక్షం మీద 23 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. అయితే అది దాని నుండి 66 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఈ కారణంగా భూమిపై పగలు, రాత్రి ఉన్నాయి. జూన్ 21 రోజు నుంచి డిసెంబర్ 22 రాత్రి భారతదేశంలో అతిపెద్దది అని మీరు ఇప్పటికే వినుంటారు. సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలు భూమి, అన్ని భాగాలలో సమానంగా పంపిణీ చేయబడనందున ఇది జరుగుతుంది. ఈ కారణంగా పగలు, రాత్రి వ్యవధిలో తేడా ఉంటుంది.

76 రోజుల పాటు నిరంతరాయంగా పగలే ఉన్నప్పటికీ ఇక్కడ ఎండ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు నార్వేలో సాధారణంగా మంచుతో కప్పబడిన ఎత్తైన శిఖరాలను చూస్తారు. నార్వే చాలా అందమైన ప్రదేశం. ఇక్కడకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో నార్వే ఒకటి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనలో చాలా మందికి అంటార్కిటికా గురించి తెలుసు. ఇక్కడ కేవలం రెండు సీజన్లు మాత్రమే కనిపిస్తాయి. ఒకటి శీతాకాలం, రెండు వేసవి కాలం. అయితే, ఇక్కడ రాత్రి 6 నెలలు రాత్రి, పగలు 6 నెలలు పగలు ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..