Chicken Price: ఆల్ టైమ్ రికార్డ్.. కిలో చికెన్ ధర రూ.1600.. కొనేందుకు జంకుతున్న అక్కడి జనం..
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లైంది పాకిస్తాన్ ప్రజల పరిస్థితి. ఇప్పటికే ధరల పెరుగుదలతో గగ్గోలు పెడుతున్న జనానికి షాక్ ఇచ్చింది పాక్ కోడి. తినేందుకు తిండి దొరక్క కొండెక్కి కూర్చుంది.
పాకిస్తాన్‌లో సంక్షోభం నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే భారీగా రూపాయి పతనం అవ్వగా.. అక్కడి పరిస్థితులు శ్రీలంకను తలపిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కసారిగా కొండెక్కిపోయాయి. వీటి ధరలు లీటరుకు 35 రూపాయలు పెంచుతున్నట్లు పాక్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ధరలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఈ మధ్యే వెల్లడించిన ప్రభుత్వం.. రోజురోజుకూ రూపాయి విలువ తగ్గిపోతుండడంతో ఈ చర్య తీసుకోక తప్పలేదని ప్రకటించింది. పాకిస్తాన్‌ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు రేపో, మాపో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-IMF అధికారుల బృందం ఆ దేశానికి రానున్న సందర్భంలో పెట్రో ఉత్పత్తుల ధరలను ఇలా ఒక్కసారిగా పెంచింది ప్రభుత్వం. దేశంలో చికెన్, మాంసం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరాచీ నగరంతో సహా మొత్తం పాకిస్తాన్‌లో వేగంగా పెరిగిపోతున్నాయి.
కరాచీ సహా ఇతర నగరాల్లో కేజీ చికెన్ ధర ఏకంగా రూ.720కి చేరింది. పాకిస్తాన్ చరిత్రలోనే ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదల, దాణా కొరత కారణంగా చాలా పౌల్ట్రీ ఫారాలు మూతపడే పరిస్థితికి దారితీసిందని సామా టీవీ ప్రసారం చేసింది.
దాణా కొరతే ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పౌల్ట్రీ ఫాం యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరాచీలో కిలో కోడి మాంసం రూ.720కి విక్రయిస్తున్నారు. రావల్పిండి, ఇస్లామాబాద్‌తోబాటు అన్ని ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు కూడా ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి.
కిలో కోడి మాంసం రూ. 700-705 వరకు అమ్ముడవుతున్నట్లు పాకిస్తాన్ టీవీ తెలిపింది. ఇదిలా ఉండగా, దేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరమైన లాహోర్‌లో చికెన్-మాంసం ధర కిలోకు రూ.550-600 మధ్య ఉంది. ఈ పెరుగుతున్న ధరలు ప్రోటీన్ ప్రధాన వనరుగా చికెన్‌పై ఆధారపడే వినియోగదారులకు ఆందోళన కలిగించాయి.
టీ ధర వింటేనే కాలిపోతోంది..
పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ తర్వాత బ్లాక్ టీ ధర గత 15 రోజుల్లో కిలో 1100 రూపాయల నుంచి 1600 రూపాయలకు పెరిగింది. పాకిస్తాన్‌లోని ఓ ఫేమస్ బ్రాండ్ 170 గ్రాముల గ్రాన్యులేటెడ్, ఏలకుల ప్యాక్ ధరను రూ.290 నుంచి రూ.320, రూ.350కి పెంచినట్లు రిటైలర్ ఒకరు తెలిపారు. 420 గ్రాముల ప్యాక్‌ల ధర ఇప్పుడు రూ. 1350, రూ. 550 బదులుగా రూ. 1480, రూ. 720 చేశారు. ఇతర ప్యాకర్లు కూడా ధరలను పెంచడానికి సిద్ధంగా ఉన్నారు.
డాన్‌లోని ఒక నివేదిక ప్రకారం, టీపై ఫెడరేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FPCCI) స్టాండింగ్ కమిటీ కన్వీనర్ జీషన్ మక్సూద్ మాట్లాడుతూ, దిగుమతులు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని, ఇది మార్చిలో పెద్ద కొరతకు దారితీయవచ్చని ముందుగానే హెచ్చరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం