Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Kishan Reddy: ప్రెస్‌క్లబ్‌కు వస్తారా.. ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా.. సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..

కేంద్రంపై బురద చల్లేందుకే అసెంబ్లీని ఉపయోగించుకున్నారంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా అసత్య ఆరోపణలు చేశారని.. వాస్తవాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Minister Kishan Reddy: ప్రెస్‌క్లబ్‌కు వస్తారా.. ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా.. సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..
Minister Kishan Reddy On Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 13, 2023 | 12:50 PM

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై బురద చల్లేందుకే అసెంబ్లీని ఉపయోగించుకున్నారంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా అసత్య ఆరోపణలు చేశారని.. వాస్తవాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరాశ, నిస్పృహలతో వారి ప్రసంగం ఉందన్నారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీల్ని ఏం చేశారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక్క మాట చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌ను మండలిలో కాంగ్రెస్‌ లేకుండా చేసింది వాళ్లే అని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ మద్దతు కోసం అర్రులు చాస్తున్నారని.. అందుకే సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ను పొగడ్తలతో ముంచెత్తారన్నారు. బీజేపీకి ఒక సీటు కూడా రాదన్నారు. బీఆర్‌ఎస్‌కు వరదలా ఓట్లు వస్తాయట.. దేశ ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండా కేసీఆర్‌ మాట్లాడారు. తన పరిధి దాటి కేసీఆర్‌ మాట్లాడారు.. అన్ని దేశాల ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు.. కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మాత్రం మాట్లాడలేదని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌కు రారు.. పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలపై అసెంబ్లీలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము ధైర్యం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఎందుకు మాట్లాడలేదన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, బడ్జెట్‌ సమావేశాలను పొలిటికల్‌ మీటింగ్స్‌గా మార్చుకున్నారు.

సీఎం కేసీఆర్‌ చెప్పిన తిరుమలరాయ కథ ఆయనకే వర్తిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేసీఆర్‌ రాజీనామాపై ఇప్పుడే ఎందుకు.. ఎన్నికల తర్వాత ఎలాగూ రాజీనామా చేయాల్సిందే అని ఎద్దేవ చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు మేం సిద్ధమన్నారు కిషన్‌రెడ్డి. చర్చ కోసం ప్రెస్‌క్లబ్‌కు వస్తారా, అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. ప్రగతిభవన్‌కు, ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా.. రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని వస్తారా, రండి ఛాలెంజ్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

లైవ్ వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం