కప్పను కూరొండిన తండ్రి.. ఇంటిల్లిపాదికి అనారోగ్యం, ఆరేళ్ల చిన్నారి మృతి

ఈ ఘటనపై బామెబెరి పోలీస్ స్టేషన్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

కప్పను కూరొండిన తండ్రి.. ఇంటిల్లిపాదికి అనారోగ్యం, ఆరేళ్ల చిన్నారి మృతి
Frog Curry
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 13, 2023 | 11:52 AM

ఇంట్లోకి కప్ప వచ్చిందనే కోపంతో ఓ తండ్రి దాన్ని చంపి పులుసు చేశాడు. అది తిని ఆరేళ్ల చిన్నారి పాప మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లోకి వచ్చిన కప్పను ఓ గిరిజనుడు చంపి కూర వండడంతో ఆరేళ్ల సుమిత్ర ముండా మృతి చెందింది. అలాగే, మరో 4 ఏళ్ల చిన్నారి మున్నీ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటన కియోంజర్ జిల్లాలోని జోడా బ్లాక్‌లో చోటుచేసుకుంది. తండ్రి మున్నా ముండా కూడా ఈ కప్ప సాంబార్ తిని అనారోగ్యం బారినపడ్డాడు. ఈ వార్త తెలుసుకున్న పోలీసులు కియోంజర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని బమేబారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుదా అనే గ్రామాన్ని సందర్శించారు. ప్రత్యక్ష సాక్షులు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు.

40 ఏళ్ల గిరిజన సంఘం ఎదురుగా ఉన్న ముండా ఇంట్లోకి గురువారం సాయంత్రం ఓ కప్ప ప్రవేశించింది. కప్పరాకతో ఆగ్రహించిన ఆ తండ్రి దాన్ని చంపి వంటచేశాడు. తర్వాత దాన్ని కుటుంబసభ్యులు తిన్నారు. కొద్ది సేపటికి ఇంటిల్లిపాది వాంతులతో స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలను కియోంజర్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్సపొందుతునే ఆరేళ్ల బాలిక సుమిత్ర మృతి చెందింది.

ఈ ఘటనపై బామెబెరి పోలీస్ స్టేషన్ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు బామేబేరి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ స్వరూప్ రంజన్ నాయక్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కప్పల శరీరంలోని పరోటిడ్ గ్రంధి వాటిని వేటాడే జంతువుల నుండి రక్షించడానికి టాక్సిన్స్ కలిగి ఉంటుంది. ఇది కప్పను తినే వారిపై ప్రభావం చూపుతుంది. అలాగే, కొన్ని కప్పల చర్మం కూడా విషపూరితమైనదని ఇక్కడి వీఎస్‌ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సంజీబ్ మిశ్రా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..