Video: టాస్ కోసం రంగం సిద్ధం.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదంతో జనం పరుగులు.. వైరల్ వీడియో
ముల్తాన్ సుల్తాన్‌లు, లాహోర్ ఖలందర్‌ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ముల్తాన్ క్రికెట్ స్టేడియంలోని ఫ్లడ్ లైట్స్‌లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ప్రారంభమైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడుతున్నాయి. అదే సమయంలో ముల్తాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో స్టేడియంలో ప్రమాదం జరిగింది. నిజానికి ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్లలో మంటలు చెలరేగాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు వార్తలు లేవు. గ్రౌండ్ వర్కర్లు మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది.
వీడియో వైరల్..
Things under control now. Floodlights back on! #HBLPSL8pic.twitter.com/iaTI94q1F0
ఇవి కూడా చదవండి— Farid Khan (@_FaridKhan) February 13, 2023
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై అభిమానులు కామెంట్లతో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ క్వాలండర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం ముల్తాన్ సుల్తాన్ టీం ఛేజింగ్ చేసినా.. కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోయింది.
Fire Brigade at Multan Stadium before the first match of PSL 8 – sources say a light caught fire. pic.twitter.com/HuLjkwxUf5
— Shiffa Z. Yousafzai (@Shiffa_ZY) February 13, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..