IND vs NZ: 3 ఫార్మాట్‌లలో సెంచరీలు బాదిన టీమిండియా బ్యాటర్స్ వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా?
Shubman Gill Century: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 ఇంటర్నేషనల్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీ చేశాడు. భారత్ తరపున 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.
Team India Players Century in All Formats: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు 168 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ ఈ విజయంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ 63 బంతుల్లో 126 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో గిల్ స్ట్రైక్ రేట్ 200గా నిలిచింది. అంతర్జాతీయ టీ20లో గిల్‌కి ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఈ సెంచరీతో భారత్ తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరాడు.
భారత్ తరపున 3 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్..
టెస్టు, వన్డే, టీ20 ఇంటర్నేషనల్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా శుభ్మన్ గిల్ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత గిల్ పేరు నమోదైంది. భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా తొలిసారిగా ఈ ఘనత సాధించాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు తరపున రైనా తొలి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, తాజాగా శుభ్‌మన్‌లు భారత్ తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించారు.
భారతదేశం తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితా ఇదే..
1. సురేష్ రైనా
2. రోహిత్ శర్మ
3. కేఎల్ రాహుల్
4. విరాట్ కోహ్లీ
5. శుభమాన్ గిల్
టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున అత్యధిక స్కోరు ఏదంటే?
న్యూజిలాండ్‌పై గిల్ 126 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున ఏ ఆటగాడు ఆడిన అతిపెద్ద ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు ఆఫ్ఘనిస్థాన్‌పై 122 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
గిల్ అంతర్జాతీయ కెరీర్..
గిల్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 13 టెస్టులు, 21 వన్డేలు, 6 టీ20 ఇంటర్నేషనల్‌లు ఆడాడు. టెస్టుల్లో 32 సగటుతో 736 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను వన్డేలలో 73.76 సగటుతో 1254 పరుగులు చేశాడు. అదే సమయంలో టీ20 ఇంటర్నేషనల్‌లో అతని బ్యాట్ నుంచి 40.40 సగటు, 165.57 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 202 పరుగులు వచ్చాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..