- Telugu News Photo Gallery Cricket photos Check here for the list of Team India players who have scored century in T20I Format
Team India T20 Centurions: పొట్టి క్రికెట్‌లో సెంచరీ అంటే చుక్కలే.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు వీరే..
టీమ్ ఇండియాకు టీ20 సెంచరీలు: బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 166 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభమాన్ గిల్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా నిలిచాడు.
Updated on: Feb 02, 2023 | 6:30 AM

బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభమాన్ గిల్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా నిలిచాడు. 54 బంతుల్లోనే సెంచరీ చేసిన గిల్, 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 126 పరుగులు చేశాడు.

భారత జట్టు తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గిల్ కంటే ముందు ఈ ఘనతను కొద్ది మంది ప్లేయర్లు మాత్రమే సాధించారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. సురేశ్ రైనా: టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున సురేష్ రైనా తొలి సెంచరీ సాధించాడు. 2010లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో రైనా ఈ ఘనత సాధించాడు.

2. రోహిత్ శర్మ: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం 4 సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాక భారత్ తరఫున ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం.


4. కేఎల్ రాహుల్: భారత్ తరఫున టీ20 సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో రాహుల్ రెండు సెంచరీలు చేశాడు.


6. దీపక్ హుడా: భారత జట్టు యువ ఆల్ రౌండర్ దీపక్ హుడా కూడా టీ20లో సెంచరీ సాధించాడు.

7. శుభ్‌మన్ గిల్: బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభమాన్ గిల్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న శుభ్‌మన్ గిల్ 7 భారీ సిక్సర్లు, 12 ఫోర్లతో అజేయంగా 126 పరుగులు చేశాడు.





























