Venkata Chari |
Updated on: Feb 02, 2023 | 8:44 AM
చాలా రోజుల నిరీక్షణ, ఊహాగానాల తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. నలుగురు మాజీ టెస్టు క్రికెటర్లతో కూడిన సీనియర్ సెలక్షన్ కమిటీని పాకిస్థాన్ బోర్డు నియమించింది.
మాజీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ హరూన్ రషీద్, కమ్రాన్ అక్మల్ నేతృత్వంలోని సీనియర్, జూనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలను పీసీబీ బుధవారం ప్రకటించింది.
హరూన్‌తో పాటు, సీనియర్ సెలక్షన్ కమిటీలో కమ్రాన్ అక్లామ్, యాసిర్ హమీద్, మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సమీ కూడా ఉంటారు. కమ్రాన్, యాసిర్, సమీ జాతీయ సెలెక్టర్లుగా ఎంపిక కావడం ఇదే తొలిసారి.
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షమీ తన స్పీడ్ బౌలింగ్‌కు ఎంతగా ప్రసిద్ధి చెందాడో తెలిసిందే. అతని 17 బంతుల ఓవర్ రికార్డు కూడా అంతగా చర్చనీయాంశమైంది. 2004 ఆసియా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వైడ్‌లు, 4 నో బాల్స్ కారణంగా షమీ 17 బంతుల ఓవర్‌ను బౌలింగ్ చేశాడు.
అదే సమయంలో జూనియర్ సెలక్షన్ కమిటీలో కమ్రాన్ అక్లామ్ అధ్యక్షతన తౌసీఫ్ అహ్మద్, అర్షద్ ఖాన్, షాహిద్ నజీర్, షోయబ్ ఖాన్ జట్టును ఎంపిక చేస్తారు.