- Telugu News Photo Gallery Cricket photos Surya Kumar Yadav has left behind the former African batter AB de Villiers in T20s
Surya Kumar Yadav: టీ20లలో మరో రికార్డును బద్దలు.. ఏబీ డివిల్లియర్స్‌ను అధిగమించిన ఇండియన్ ‘మిస్టర్ 360’..
సూర్యకుమార్ యాదవ్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి ఓ ప్రత్యేక ఫీట్ చేశాడు. ఏకంగా మిస్టర్ 360 డిగ్రీ ఫేమ్ ఏబీ డివిలియర్స్‌ను టీ20లలో అధిగమించేశాడు. సూర్య ఏ విధంగా ఈ ఘనత సాధించాడో ఇక్కడ చూద్దాం..
Updated on: Feb 03, 2023 | 7:15 AM

అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో 13 బంతులలో 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అంతర్జాతీయ టీ20 పరుగుల పరంగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ను అధిగమించాడు.

అవును, 78 మ్యాచ్‌లలో 75 ఇన్నింగ్ ఆడి 1672 పరుగులు చేసిన ఏబీ డివిలియర్స్‌ను బుధవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

సూర్యకుమార్ యాదవ్ కేవలం 46 టీ20 ఇన్నింగ్స్‌ల్లోనే మొత్తం 1675 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

అయితే ఈ ఇద్దరు క్రికెటర్లను క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘మిస్టర్ 360’ అని పిలుచుకోవడం మరో విశేషం.

ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కింగ్ కోహ్లీ 107 టీ20 ఇన్నింగ్స్‌ల ద్వారా మొత్తం 4008 పరుగులు చేశాడు. ఇక ఇందులో 37 అర్ధసెంచరీలు, 1 సెంచరీ కూడా ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ తప్ప మరే బ్యాట్స్‌మెన్ 4000 పరుగులు చేయకపోవడం విశేషం.




