ఇవేం చెత్త రికార్డులు బ్రో.. సౌతాఫ్రికాను బలి చేస్తోన్న ఆ సెంటిమెంట్.. ఇంగ్లండ్ రూపంలో మరోసారి.. భారత్ వచ్చేనా?

South Africa Vs England: ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా ఇంకా నేరుగా అర్హత సాధించకపోవడంతో ఈ ఒక్క పొరపాటు వారికి మరో దెబ్బ తగిలింది.

Venkata Chari

|

Updated on: Feb 03, 2023 | 8:32 AM

ODI World Cup 2023: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించాలని ప్రయత్నిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు కష్టాలకు అంతే లేకుండా ఉంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆనందం కూడా ఆ జట్టుకు లేకపోయింది. దక్షిణాఫ్రికా టీం భారత్‌లో జరగబోయే ఈ టోర్నీకి అర్హత సాధించే అవకాశాలు తీవ్రంగా దెబ్బతినడమే దానికి కారణంగా నిలిచింది.

1 / 6
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టెంబా బావుమా సేన.. మంచి స్థితిలో ఉన్నట్లు అనిపించింది. అయితే ఫిబ్రవరి 1, బుధవారం, జోఫ్రా ఆర్చర్ 6 వికెట్ల ఆధారంగా, ఇంగ్లాండ్ చివరి వన్డేలో గెలవడంతో.. సౌతాఫ్రికా కష్టాలు పెరిగేలా చేసింది.

2 / 6
ఈ ఓటమితో దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగలగా, మరోవైపు ఆటగాళ్లు కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మూడవ వన్డే రిఫరీ, జెఫ్ క్రోవ్ ఆ జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడమే కాకుండా, స్లో ఓవర్ రేట్‌తో ఒక పాయింట్‌ను తగ్గించారు.

3 / 6
వన్డే సూపర్ లీగ్ కింద, జట్లు ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించాలంటే టాప్ 8లో చేరాల్సి ఉంది. ఇందులో 7 జట్లు నేరుగా అర్హత సాధించాయి. కానీ, దక్షిణాఫ్రికా ఇంకా అర్హత సాధించలేదు. వెస్టిండీస్ తర్వాత తొమ్మిదో స్థానంలో ఉంది.

4 / 6
ఈ మ్యాచ్‌కు ముందు, సూపర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా 79 పాయింట్లను కలిగి ఉంది. మ్యాచ్‌లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు ఎక్కువ పాయింట్లు పొందే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు పై నుంచి 1 పాయింట్ కోల్పోవడంతో 78 పాయింట్లే ఆ జట్టు ఖాతాలో మిగిలి ఉన్నాయి.

5 / 6
దక్షిణాఫ్రికా ఇప్పుడు నెదర్లాండ్స్‌తో 2 వన్డే మ్యాచ్‌లు ఆడాలి. అర్హత సాధించాలంటే, ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. దీంతో పాటు శ్రీలంక, ఐర్లాండ్‌ల ఓటమిపైనా ఆ జట్టు ఆధారాపడాల్సి ఉంది.

6 / 6
Follow us