అరంగేట్రంలో 4 వికెట్లతో సత్తా.. కట్‌చేస్తే.. 3 మ్యాచ్‌లతోనే కెరీర్ క్లోజ్.. చరిత్రలోనే అత్యంత బ్యాడ్‌లక్ ప్లేయర్..

England vs South Africa: 33 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జో బెంజమిన్, 2021లో 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు.

అరంగేట్రంలో 4 వికెట్లతో సత్తా.. కట్‌చేస్తే.. 3 మ్యాచ్‌లతోనే కెరీర్ క్లోజ్.. చరిత్రలోనే అత్యంత బ్యాడ్‌లక్ ప్లేయర్..
England Player joey benjamin
Follow us

|

Updated on: Feb 02, 2023 | 9:10 AM

క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టకర క్రికెటర్ల జాబితా తయారు చేస్తే.. అందులో బెంజమిన్ పేరు తప్పక ఉంటుంది. బెంజమిన్ 2 ఫిబ్రవరి 1961లో వెస్టిండీస్‌లో జన్మించాడు. అయితే, అతను ఇంగ్లాండ్ తరపున క్రికెట్ ఆడేవాడు. అంతర్జాతీయ కెరీర్ క్రికెట్ సుదీర్ఘ ఫార్మాట్‌తో ప్రారంభమైంది. అయితే, ఒక్క మ్యాచ్‌ కంటే ఎక్కువ ఆడలేకపోయాడు. ఆ తర్వాత, అతనికి వన్డే క్రికెట్‌లో అవకాశం లభించింది. ఆట రెండు మ్యాచ్‌లతో ముగిసింది.

33 ఏళ్ల వయసులో, జో బెంజమిన్ ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన తర్వాత, అతను ఈ అవకాశాన్ని పొందాడు. అరంగేట్రం టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే 42 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అయితే బ్యాటింగ్‌లో బెంజమిన్ ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ పడలేదు. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో అతడు వేసిన పునాది ఇంగ్లండ్ విజయానికి నాంది పడింది.

తొలి టెస్టు చివరిదిగా..

అయితే, ఆగస్ట్ 1994లో ఆడిన ఈ టెస్ట్ తర్వాత, బెంజమిన్ పేరు కేవలం చరిత్రగా మిగిలిపోయింది. అతను తదుపరి టెస్ట్ ఆడే అవకాశం అందుకోలేకపోయాడు. ఈ విధంగా మొదటి టెస్ట్ అతని కెరీర్‌లో కూడా చివరిదని నిరూపితమైంది.

ఇవి కూడా చదవండి

2 మ్యాచ్‌ల తర్వాత వన్డే కెరీర్ క్లోజ్..

ఆగస్ట్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేసిన తర్వాత, బెంజమిన్ డిసెంబర్ 1994లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ తరపున ODI అరంగేట్రం చేశాడు. జనవరి 1995లో, అతను జింబాబ్వేపై తన రెండవ ODI ఆడాడు. ఈ రెండు వన్డేల్లో బెంజమిన్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అలాగే బ్యాట్‌తోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.

కెరీర్‌లో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే..

ఈ విధంగా, జో బెంజమిన్ తన మొత్తం అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 33 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ క్రికెటర్ 2021లో 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!